Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రేకింగ్ న్యూస్‌:GATE 2027 దరఖాస్తులో కీలక మార్పులు.. ఇక డిజిలాకర్ ద్వారా వెరిఫికేషన్ తప్పనిసరి

బ్రేకింగ్ న్యూస్‌:GATE 2027 దరఖాస్తులో కీలక మార్పులు.. ఇక డిజిలాకర్ ద్వారా వెరిఫికేషన్ తప్పనిసరి

SAKSHI EDUCATION 2 weeks ago
  • పేరు
  • పుట్టిన తేదీ
  • మొబైల్ నంబర్
  • ఈ-మెయిల్ ఐడీ
  • చిరునామా
  • వెరిఫైడ్ ఐడీ వివరాలు

వంటి సమాచారాన్ని సేకరించనున్నారు.

అయితే డిజిలాకర్‌లో ఉన్న ఫొటోను GATE అప్లికేషన్ ఫొటోగా పరిగణించరు.

అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా లైవ్ ఫొటోతో పాటు తాజా ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

డిజిలాకర్‌లో 'GATE2027' పేరుతో ప్రత్యేక ఫోల్డర్‌లో పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని ఐఐటీ మద్రాస్ స్పష్టం చేసింది. డిజిలాకర్‌లో అందుబాటులో ఉన్న వెరిఫైడ్ డాక్యుమెంట్లలో సరైన వివరాలు ఉన్న గుర్తింపు పత్రాన్ని అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు.

పేరు లేదా పుట్టిన తేదీలో ఏదైనా తప్పు ఉంటే, సరైన వివరాలు ఉన్న మరో వెరిఫైడ్ ఐడీని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

GATE 2027లో మరో ముఖ్యమైన మార్పు చేశారు. కొత్తగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ (RA) పేరుతో టెస్ట్ పేపర్‌ను ప్రవేశపెట్టారు. దీనికి అనుగుణంగా పరీక్ష సిలబస్‌లో కూడా మార్పులు చేశారు.

  • రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 27, 2026
  • ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా చివరి తేదీ:
  • ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 5, 2026
  • పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21, 2027

GATE 2027కు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు డిజిలాకర్‌లో తమ వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఐఐటీ మద్రాస్ సూచించింది.

బ్రేకింగ్ న్యూస్‌: ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు మరో అవకాశం.. సెప్టెంబర్ 7 వరకు గడువు పొడిగింపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education