ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావడం, పరీక్షల వాయిదాలు, TSPSC వివాదాల కారణంగా అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని నిరుద్యోగ సంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచిన సందర్భాలు ఉన్నాయి.
ప్రస్తుతం విడుదలైన తాజా ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి జీవో వివరాలు, ఏఏ పోస్టులకు వర్తిస్తుంది?, రిజర్వేషన్ వర్గాలకు అదనపు సడలింపులు ఉంటాయా? వంటి అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వర్తింపు
- గ్రూప్స్, డిపార్ట్‌మెంట్ పోస్టులు వంటి సాధారణ ఉద్యోగాలకు అవకాశం
- నిరుద్యోగ యువతకు అదనపు ఛాన్స్
యూనిఫామ్ సర్వీసులు (పోలీస్, ఫైర్, ఇతర రక్షణ విభాగాలు)కు ఈ వయో పరిమితి పెంపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వయో పరిమితి పెంపుతో పాటు త్వరలో వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడే అవకాశముందని అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
CBSE 12వ తరగతి ఫలితాలపై కీలక నిర్ణయం.. రీ-ఎవాల్యుయేషన్‌లో మార్కులు పెరిగితే ఫీజు రీఫండ్!
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

