Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BTech Students & AI: ప్రతి BTech విద్యార్థి నేర్చుకోవాల్సిన AI స్కిల్స్!

BTech Students & AI: ప్రతి BTech విద్యార్థి నేర్చుకోవాల్సిన AI స్కిల్స్!

SAKSHI EDUCATION 3 days ago

ప్రస్తుతం ఏఐ, ఐఓటీ, రోబోటిక్స్‌ వంటి డిజి టల్‌ సాంకేతికతలు రాజ్యమేలుతున్నాయి. అన్ని రంగా ల్లోని సంస్థలూ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

ఇందు కో సం తగిన నైపుణ్యాలున్న వారికే నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీటెక్‌ లో చేరిన విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే ఏఐ టెక్నాలజీస్‌ను ఔపోసన పట్టాలి. ఏఐ నైపుణ్యా లపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. మూడో సంవత్సరంలోనో లేదా నాలుగో సంవత్సరంలోనో నేర్చుకుందాం అనుకుంటే..పూర్తి స్థాయిలో అవగాహ న పొందడం కష్టమే అవుతుంది.

బీటెక్‌ విద్యార్థులు తమ బ్రాంచ్‌కు సరితూగే ఏఐ స్కిల్స్‌ను కాలేజీలోనే అందిపుచ్చుకోవాలి. ఇందుకో సం తమ బ్రాంచ్‌కు సంబంధించిన రంగంలో అమ లవుతున్న ఏఐ టూల్స్‌ గురించి తెలుసుకోవాలి. వాటిని ఆయా సబ్జెక్ట్‌తో అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగాలి. సర్క్యూట్‌ బ్రాంచ్‌ మొదలు సాఫ్ట్‌వేర్‌ కొలువులకు మార్గం వేసే సీఎస్‌ఈ, ఐటీ విద్యార్థుల వరకు.. ప్రతి ఒక్కరూ ఈ దిశగా కృషి చేయాలి.

AI Careers: ఏఐతో ఉద్యోగాలు పోవు.. కొత్త కెరీర్ అవకాశాలు వస్తాయి.. AI ప్రపంచంలో టాప్ 10 ఉద్యోగాలు ఇవే!

  • బీటెక్‌ విద్యార్థులు ఏఐ నైపుణ్యాలతో ఆయా రంగాల్లో ముందంజలో నిలిచే అవకాశముంది. ము ఖ్యంగా ఏఐ టూల్స్, ప్రిడిక్టివ్‌ అల్గారిథమ్స్‌ విని యోగించి ప్రొడక్ట్‌ డిజైన్‌ చేసే నైపుణ్యం లభిస్తుంది.
  • సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు బిల్డింగ్‌ ఇన్ఫర్మేషన్‌ మోడలింగ్‌ వంటి మోడల్స్‌ను డిజైన్‌ చేయడానికి ఏఐ టూల్‌ ఉపయోగపడతాయి.
  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఏఐ ఆధారిత సిములేషన్స్, కంట్రోల్‌ సిస్టమ్స్, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌ అప్లికేషన్స్‌లో ఏఐ టూల్స్‌ దోహదపడతాయి.
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో క్లిష్టమైన మోడల్స్‌ను రూపొందించడానికి ఏఐ టూల్స్, ప్లగిన్స్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.

బీటెక్‌ విద్యార్థులు తమ బ్రాంచ్‌తో ఏఐ టూల్స్‌ను అనుసంధానం చేసుకోవాలంటే కొన్ని బేసిక్‌ నైపుణ్యాలను అభ్యసించాలి. అవి..

  • పైథాన్‌ ప్రోగ్రామ్రింగ్‌: ఏఐ ఏజెంట్లకు సంబంధించి ఈ ప్రోగ్రామింగ్‌ ఎంతో కీలకంగా నిలుస్తోంది. ఇందులో డేటా విజువలైజేషన్, డేటా మానిప్యులేషన్, మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్, టెన్సార్‌ ఫ్లో, పైటార్క్‌ వంటి అంశాల్లో పట్టు సాధించొచ్చు.
  • ఎంఎల్‌ ఫండమెంటల్స్‌: మెషిన్‌ లెర్నింగ్‌లో ఫండమెంటల్స్‌ నేర్చుకోవడం ద్వారా స్మార్ట్‌ క్వాలిటీ కంట్రోల్‌ సిస్టమ్స్, నాన్‌ సెల్ఫ్‌ కరెక్షన్‌ సిస్టమ్‌ వంటి వాటిపై అవగాహన పొందొచ్చు.
  • డేటా ప్రాసెసింగ్, అనాలిసిస్‌: ఏఐ టూల్స్‌లో ఇది ఎంతో కీలకంగా నిలుస్తోంది. సివిల్, మెకానికల్‌ వంటి కోర్‌ బ్రాంచ్‌లతోపాటు అన్ని ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ల విద్యార్థులు దీన్ని నేర్చుకోవాల్సిన ఆవశ్యకత నెలకొంది.
  • న్యూరల్‌ నెట్‌వర్క్స్, డీప్‌ లెర్నింగ్‌: డీప్‌ లెర్నింగ్‌ అనేది ఏఐలో మానవ ఆలోచన శక్తికి, పనితీరుకు ప్రామాణికంగా నిలుస్తోంది. ఇంటెలిజెంట్‌ రోబో టిక్స్, ఐఓటీ, సిముల్యేషన్‌ అసిస్టెంట్‌ వంటి ఏఐ నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఇది ఎంతో ఉపయుక్తం.

44 Lakh Jobs: క్లీన్ ఎనర్జీలో కెరీర్‌కు గ్రీన్ సిగ్నల్.. ఈ కోర్సులు చేస్తే భారీ అవకాశాలు!

ప్రస్తుతం కీలకంగా నిలుస్తున్న నైపుణ్యాలు.. కోడింగ్, ప్రోగ్రామింగ్‌. వాస్తవానికి కోర్సు స్వరూ పంలోనే వీటికి ప్రాధాన్యం ఉంది. అయితే ప్రాక్టికల్‌ అప్రోచ్‌ తక్కువగా ఉండడంతో విద్యార్థులకు ఈ నైపుణ్యాలు ఆశించినంతగా లభించట్లేదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. సీఎస్‌ఈ, ఐటీ తదితర సాఫ్ట్‌వేర్‌ అనుబంధ బ్రాంచ్‌ల విద్యార్థులు కోడింగ్, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లను ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో నేర్చుకునేందుకు సిద్ధమవ్వాలి. ముఖ్యంగా పైథాన్, ఆర్, జావా, జావా స్క్రిప్ట్, సీ++, పీహెచ్‌పీ, ఎస్‌ క్యూఎల్‌ డేటాబేస్‌ వంటి లాంగ్వేజెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీటిని నేర్చుకునేందుకు పలు షార్ట్‌టర్మ్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జావా, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్‌ హ్యాట్, ఐబీఎం, జెట్‌ కింగ్‌ వంటి సంస్థలు కోడింగ్‌ నైపు ణ్యాల సమ్మిళితంగా ఉండే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తున్నాయి.

  • ఈసీఈ, ఈఈఈ వంటి సర్క్యూట్‌ బ్రాంచ్‌ల విద్యార్థులు లేటెస్ట్‌ డిజిటల్‌ స్కిల్స్‌ సొంతం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలి.
  • ఈసీఈ విద్యార్థులు రోబోటిక్స్, వీఎల్‌ఎస్‌ఐ, నానో టెక్నాలజీ విభాగాల్లో షార్ట్‌టర్మ్‌ సర్టిఫికేష న్‌ కోర్సులు పూర్తి చేయడం ద్వారా జాబ్‌ మార్కెట్లో ముందుండొచ్చు. ఈసీఈ విద్యార్థుల కు కలిసొచ్చే మరికొన్ని సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఫైబర్‌ ఆప్టిక్‌ టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ ఆటోమే షన్, డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్, రోబోటిక్స్‌. ఈఈఈ విద్యార్థులు ఎలక్ట్రికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్, పవర్‌ సిస్టమ్స్‌ అనాలిసిస్, సర్క్యూట్‌ అనాలిసిస్, అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ ఇన్‌ సిస్టమ్స్‌ ఇంజనీరింగ్‌పై దృష్టిపెట్టాలి. వీటితోపాటు సీఏడీఏ(సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌), డిస్ట్రిబ్యూటెడ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌ వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీటిని ఇప్పుడు పలు మార్గాల్లో నేర్చుకునే అవకాశం ఉంది.

మెకానికల్‌ బ్రాంచ్‌ విద్యార్థులు రోబోటిక్‌ స్కిల్స్‌ను నేర్చుకోవాలి. దీంతోపాటు క్యాడ్, క్యామ్, 2-డి, 3-డి డిజైన్‌ ప్రింటింగ్‌లపైనా దృష్టిపెట్టాలి. ఇప్పుడు రోబో ఆధారిత కార్యకలాపాలు అన్ని విభాగాల్లోనూ సాగుతున్నాయి. కాబట్టి అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు రోబోటిక్‌ స్కిల్స్‌ కెరీర్‌ పరంగా మేలు చేస్తాయని చెప్పొచ్చు. వీటిని సొంతంగా అభ్యసించేందుకు ఆన్‌లైన్‌ మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

ITI చేస్తే జాబ్ రెడీ.. భారీ డిమాండ్‌లో ఈ ఉద్యోగాలు!

ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఏ అంశాన్నైనా ప్రాక్టికల్, అప్లికేషన్‌ అప్రోచ్‌తో అధ్యయనం చేయా లి. ఈ ప్రాక్టికల్‌ అప్రోచ్, అప్లికేషన్‌ అప్రోచ్‌ పెంపొందాలంటే.. లేబొరేటరీల్లో ప్రాక్టికల్స్‌ కోసం సమయం వెచ్చించాలి. అలాకాకుండా కేవలం పుస్త కాలకే పరిమితమైతే పరీక్షల్లో మార్కులు వస్తాయి. కానీ.. రియల్‌ టైం నైపుణ్యాలు లభించవు. ఇటీవల కాలంలో పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూ ట్‌లు మెంటారింగ్‌ సెల్స్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నాయి. క్లాస్‌ రూంలో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి బిడియపడే విద్యార్థులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవచ్చు.

  • విద్యార్థులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయి ప్రొఫెసర్ల లెక్చర్స్‌ వినే అవకాశం ఉన్న మూక్స్, అదే విధంగా జాతీయ స్థాయిలో ఎన్‌పీటీఈఎల్, స్వయం వంటి ఆన్‌లైన్‌ టీచింగ్‌ పోర్టల్స్‌లో పేర్లు నమోదు చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.
  • అదే విధంగా ప్రస్తుతం పలు ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ సంస్థలు నిర్దిష్టంగా ఒక కోర్సు, ప్రోగ్రామ్‌లకు సంబంధించి ఆన్‌లైన్‌ టీచింగ్‌ సదుపాయం కల్పిస్తున్నాయి. నామమాత్రపు ఫీజుతో వీటిలో పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా తమకు ఇష్టమైన అంశాలకు సంబంధించి వర్చువల్‌ క్లాస్‌ రూమ్స్, లేబరేటరీస్‌ విధానంలో నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు.
  • చాట్‌జీపీటీ, జెమినై, క్లాడ్‌ వంటి ఏఐ అసిస్టెంట్ల వినియోగం
  • ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ బేసిక్స్‌డేటా విశ్లేషణ (ఎక్స్‌ఎల్‌+ పైథాన్‌+ఏఐ టూల్స్‌)
  • గిట్, గిట్‌హబ్‌ వినియోగం
  • ఏఐ ఏజెంట్స్‌ రూపకల్పనపై అవగాహన-నో కోడ్‌/ లో కోడ్‌ ఏఐ టూల్స్‌
  • డేటా ప్రైవసీ, ఏఐ ఎథిక్స్‌
  • ప్రజెంటేషన్లు, నివేదికలు, రీసెర్చ్‌లో ఏఐ వినియోగం
  • తమ కోర్‌ బ్రాంచ్‌కు సంబంధించిన ఏఐ అప్లికేషన్లు
  • గూగుల్‌ ఏఐ స్టూడియో- జనరేటివ్‌ ఏఐ, ప్రాంప్టింగ్‌
  • మైక్రోసాఫ్ట్‌ లెర్న్‌- ఏఐ, కోపైలెట్, అజ్యూర్‌ ఏఐ
  • ఎన్‌విడియా డీప్‌లెర్నింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌డీఐ)- ఏఐ, డీప్‌ లెర్నింగ్‌
  • డీప్‌లెర్నింగ్‌.ఏఐ- జనరేటివ్‌ ఏఐ, ఏఐ ఏజెంట్స్‌
  • కాగ్గల్‌ -మెషిన్‌లెర్నింగ్, డేటా సైన్స్‌
  • హగ్గింగ్‌ ఫేస్‌- ఓపెన్‌ సోర్స్‌ ఏఐ మోడల్స్‌
  • ఫ్రీ కోడ్‌ క్యాంప్‌- పైథాన్, ఏఐ ఫౌండేషన్స్‌
  • కోర్సెరా(అడిట్‌ మోడ్‌)
  • ఎడెక్స్‌(అడిట్‌ మోడ్‌)-మిట్, హార్వర్డ్‌ తదితర యూనివర్సిటీల ఏఐ కోర్సులు
  • గిట్‌హబ్‌ స్కిల్స్‌-గిట్, గిట్‌హబ్, కోపైలెట్‌ ప్రాథమిక్‌ శిక్షణ


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education