హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటైన Chaitanya Bharathi Institute of Technology (CBIT) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్లేస్‌మెంట్ గణాంకాలను విడుదల చేసింది.
ఈ ఏడాది కూడా వరుసగా అత్యుత్తమ ప్లేస్‌మెంట్ రికార్డును కొనసాగించింది. జనవరి 17, 2026 నాటికి మొత్తం 756 మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ ఆఫర్స్ లభించాయి.
ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్ సాధించిన విద్యార్థుల్లో అత్యధిక వార్షిక వేతనం ₹54 లక్షలు కాగా, మైక్రోసాఫ్ట్ కంపెనీ ₹1.25 లక్షల నెలవారీ స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేసింది.
- మొత్తం ప్లేస్ అయిన విద్యార్థులు: 756
- మొత్తం జాబ్ ఆఫర్లు: 1053
- హయ్యెస్ట్ ప్యాకేజ్: ₹54 లక్షలు
- హయ్యెస్ట్ ఇంటర్న్‌షిప్ స్టైపెండ్: ₹1.25 లక్షలు/నెల
- సీఎస్‌ఈ (CSE) సగటు ప్యాకేజ్: ₹9.95 లక్షలు
ఈ ఏడాది కూడా సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులకే ఎక్కువగా జాబ్ ఆఫర్స్ వరించాయి. సీఎస్‌ఈ నుంచి 139 మంది, ఐటీ నుంచి 154 మంది విద్యార్థులు ప్లేస్ అయ్యారు. అలాగే AI & ML, డేటా సైన్స్ సంబంధిత కోర్సులకు కూడా మంచి డిమాండ్ కనిపించింది.
Microsoft, Google, Amazon, Oracle, Accenture, Infosys, JP Morgan Chase వంటి ప్రముఖ సంస్థల నుంచి విద్యార్థులకు క్యాంపస్ నియామకాల్లో భారీ ఆఫర్స్ వరించాయి.
ఇన్ఫోసిస్ సంస్థ అత్యధికంగా 89 మందికి జాబ్ ఆఫర్స్ ఇవ్వగా, LTIMindtree 54 మంది, Cognizant 45 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. JP Morgan Chase సంస్థ ₹19.8 లక్షల ప్యాకేజ్‌తో 22 మందికి ఆఫర్లు ఇచ్చింది.
2024లో ₹45.6 లక్షలుగా ఉన్న హయ్యెస్ట్ ప్యాకేజ్ ఈ ఏడాది ₹54 లక్షలకు పెరగడం విశేషం. ముఖ్యంగా AI, Machine Learning, Data Science రంగాల్లో అవకాశాలు మరింత పెరుగుతున్నాయని ప్లేస్‌మెంట్ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఉన్నత స్థాయి ప్లేస్‌మెంట్లు, ప్రముఖ కంపెనీల నియామకాలు, పెరుగుతున్న సగటు వేతనాలతో Chaitanya Bharathi Institute of Technology తెలంగాణలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఒకటిగా మరోసారి తన స్థానాన్ని పదిలపరుచుకుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

