Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డేటా సెంటర్స్‌.. భవిష్యత్‌ టెక్‌ కెరీర్‌కు బూస్టర్‌.. లక్షల ఉద్యోగాలకు కొత్త అవకాశాలు!

డేటా సెంటర్స్‌.. భవిష్యత్‌ టెక్‌ కెరీర్‌కు బూస్టర్‌.. లక్షల ఉద్యోగాలకు కొత్త అవకాశాలు!

SAKSHI EDUCATION 1 week ago

దే కోవలో మరెన్నో కంపెనీలు డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా రానున్న అయిదేళ్లలో డేటా సెంటర్లలో లక్ష ఉద్యోగాలు లభిస్తాయనే అంచనాలు వెలువడుతున్నాయి.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి లేటెస్ట్‌ టెక్నాలజీకి డేటాసెంటల్స్‌ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో.. డేటా సెంటర్స్‌లో ఉద్యోగాలు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు తదితర వివరాలు..

సంస్థలు తమ వ్యాపార నిర్వహణకు సంబంధించిన సమాచారం, తమ కస్టమర్ల డేటా, ఐటీ మౌలిక వసతులు, అప్లికేషన్లు, సేవలకు సంబంధించిన డేటాను భద్రపరిచే భౌతిక ప్రదేశమే డేటా సెంటర్లు. ఇది రూ.వేల కోట్ల లావాదేవీల సమాచారాన్ని అంతటినీ ఒక చోట సురక్షితంగా పొందుపర్చిచే మార్గం. ఒకప్పుడు సంస్థలు సమాచార నిక్షిప్తానికి కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు, సీడీలు వంటి వాటిపై ఆధారపడేవి. ఇప్పుడు డేటా సెంటర్ల ద్వారా గిగాబైట్ల భారీ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో సర్వర్లు, డేటా స్టోరేజ్‌ సిస్టమ్స్, రూటర్స్, ఫైర్‌వాల్స్‌ వంటి మౌలిక వసతులతో ఈ డేటా సెంటర్లు ఏర్పాటవుతాయి. వీటి నిర్వహణకు వివిధ విభాగాల్లో నిపుణులైన మానవ వనరుల అవసరం నెలకొంది.

దేశంలో డేటాసెంటర్ల ఏర్పాటు శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 300 వరకూ డేటా సెంటర్లు ఏర్పాటయ్యాయి. వీటి సామర్థ్యం 1.8 గిగా వాట్లుగా ఉంది. ఇది 2030 నాటికి నాలుగింతలకు పైగా పెరిగి.. 6.5 గిగా వాట్లకు చేరుకుంటుందని అంచనా. అదే విధంగా డేటాసెంటర్ల మార్కెట్‌ విలువ 2030 నాటికి 20 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అదే స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

Psychology Career: సైకాలజిస్ట్‌గా మారాలనుకుంటున్నారా? మంచి కెరీర్‌ అవకాశాలు.. కోర్సులు, అర్హతలు, ఉద్యోగ వివరాలు!

ప్రస్తుతం దేశంలో ఏర్పాటైన డేటాసెంటర్లలో వేల మంది ఉపా«ధి పొందుతున్నారు. బ్లూ కాలర్‌ జాబ్స్‌ మొదలు ఐటీ నిపుణులు, టాప్‌ మేనేజీరియల్‌ పోస్టుల వరకూ... పలు అవకాశాలు లభిస్తున్నాయి. డేటా సెంటర్‌ ఏర్పాటు, నిర్వహణ కోసం మౌలిక సదుపాయా ల కల్పన దిశగా.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకాని కల్, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో టెక్నీషియన్స్, మెయింటనెన్స్‌ ఇంజనీర్స్‌ సేవలు అవసరమవు తాయి. కోర్‌ ఐటీ, టెక్నికల్‌ విభాగాల్లో క్లౌడ్‌ ఇంజనీర్స్, ఏఐ ఎంఎల్‌ ఇంజనీర్స్, నెట్‌వర్క్‌ అడ్మిని స్ట్రేటర్స్‌ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి.

డేటా సెంటర్లలో ఉద్యోగాలకు పాలిటెక్నిక్‌ డిప్లొమా మొదలు ఎంటెక్‌ పట్టభద్రుల వరకు.. వివిధ అర్హతలతో పోటీ పడే అవకాశం ఉంది. డేటాసైన్స్, డేటా అనలిటిక్స్, బిజినెస్‌ అనలిటిక్స్‌ వంటి స్పెషలైజేషన్లతో ఎంబీఏ పూర్తి చేసిన వారు, అదేవిధంగా ఏఐ ఎంఎల్‌ విభాగంలో సర్టిఫికేషన్లు, నైపుణ్యాలు ఉన్న వారు డేటా సెంటర్లలో కొలువులు దక్కించుకోవచ్చు.

డేటా సెంటర్లలో నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలు కూ డా లభిస్తాయి. ప్రధానంగా ఫెసిలిటీస్‌ మేనేజ్‌ మెంట్, లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, హెచ్‌ఆర్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌ విభాగాలు.. నాన్‌-టెక్నికల్‌లో కీలకమైనవి. ఆయా విభాగా ల్లో పీజీ కోర్సులు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.

పలు నివేదికల ప్రకారం-డేటా సెంటర్లలోని కొలువులు, అవసరమై న నైపుణ్యాల కోణంలో 20 శాతం మంది మాత్రమే సదరు ఉద్యో గా లకు సరితూగుతున్నారు. అంటే.. 80 శాతం నియామకాల్లో స్కిల్‌ గ్యాప్‌ సమస్యగా మారింది. ముఖ్యంగా.. డేటా సెంటర్ల మనుగడకు కీలకంగా నిలిచే హెచ్‌వీఏసీ, ఎలక్ట్రికల్, ఏఐ ఇంజనీర్స్, సైబర్‌ సె క్యూరిటీ ఇంజనీర్స్‌ విషయంలో స్కిల్‌ గ్యాప్‌ సమస్య ఉంది.

డేటా సెంటర్లలో డిజిటల్‌ టెక్నాలజీస్‌ ఆధారంగా కార్య కలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీరింగ్, క్లౌడ్‌ ఆపరేషన్స్, డెవాప్స్, ఎంఎల్‌ఓపీఎస్, డేటా సెంటర్‌ ఆటోమేషన్‌ వంటి విభాగాల్లో నిపుణులకు డిమాండ్‌ ¯ð లకొంది.

25 Lakhs Jobs: హెల్త్‌కేర్‌.. భవిష్యత్‌ కెరీర్‌కు బెస్ట్‌ ఛాయిస్‌.. లక్షలాది ఉద్యోగాలకు మార్గం!

డేటా సెంటర్లలో కొలువులు కోరుకునే వారు లినక్స్, విండోస్‌ సర్వర్,కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్, సిస్కో నెట్‌వర్కింంగ్, రూటింగ్‌/ స్విచింగ్, ఏడబ్ల్యూఎస్, గూగుల్‌ క్లౌడ్, పైథాన్‌ వంటి నైపు ణ్యాలు పెంచుకోవాలి.

అకడమిక్‌గా డిప్లొమా, బీటెక్, బ్యాచిలర్‌ డిగ్రీ పట్టా అందుకున్న వారు డేటా సెంటర్‌ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులు సాఫ్ట్‌వేర్‌ సర్టిఫికేషన్లు పూర్తి చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఈఆర్‌పీ సొల్యూషన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విభాగాల్లో సర్టిఫికేషన్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

  • ఫెసిలిటీస్‌ ఇంజనీర్‌: డేటా సెంటర్లలో మౌలిక వసతుల నిర్వహ ణకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
  • నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌: డేటా సెంటర్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ల్లో సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది.
  • టెక్నీషియన్‌: డేటా సెంటర్లలోని మెషినరీకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేయాల్సిన కీలక బాధ్యత. ∙
  • సైబర్‌ సెక్యూరిటీ ఇంజనీర్‌: డేటా సెంటర్లలోని డేటా సైబర్‌ అటాక్స్‌కు గురి కాకుండా పటిష్టమైన సాఫ్ట్‌వేర్‌ నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది.
  • హెచ్‌వీఏసీ ఇంజనీర్‌/టెక్నీషియన్స్‌: డేటా సెంటర్లలోని యంత్రాల కూలింగ్‌ సిస్టమ్స్‌ సమర్థ నిర్వహణ, ట్రబుల్‌ షూటింగ్‌ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

డేటా సెంటర్లలో ఫ్రెషర్స్‌కు ఫెసిలిటీస్‌ విభాగంలో రూ.6 లక్షలు, డిజైన్‌ విభాగంలో రూ.8 లక్షలు, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో రూ.9 లక్షలు, పవర్‌ సిస్టమ్స్‌ విభాగంలో రూ.9 లక్షలు చొప్పున వార్షిక వేతనాలు లభిస్తున్నాయి. ఐఏ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విభాగాల్లో ఫ్రెషర్స్‌కు సగటున రూ.10 లక్షల వరకు వార్షిక వేతనం అందుతోంది.

  • దేశంలో ప్రస్తుతం 300 వరకూ డేటా సెంటర్లు
  • 1.8 గిగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు
  • 2030 నాటికి 6.5 గిగా వాట్లకు పెరిగే అంచనా
  • మార్కెట్‌ విలువ 20 బిలియన్‌
  • డాలర్లకు చేరుకునే అవకాశం
  • ప్రస్తుతం దేశంలో 90 వేలకు పైగా ఉద్యోగాలు
  • 2030 నాటికి కొత్తగా మరో లక్ష ఉద్యోగాలు
  • పరోక్షంగా అదనంగా 3 లక్షల మందికి ఉపాధి
  • డిప్లొమా లేదా బీటెక్‌తో కొలువులు
  • ఎంబీఏ పూర్తి చేస్తే డేటా అనలిటిక్స్‌ జాబ్స్‌
  • ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్,
  • సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగాలు


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education