Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల సందడి.. హోరా హోరి పోటీ...!

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల సందడి.. హోరా హోరి పోటీ...!

పోలింగ్ ఇంకా కొనసాగుతుండగానే వెలువడుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. అదితి మహావిద్యాలయ, శ్రీ అరబిందో కాలేజ్ (మార్నింగ్), డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజ్, భారతి కాలేజ్, శివాజీ కాలేజ్ తదితర విద్యాసంస్థల్లో ఎకగ్రీవంగా లేదా పోలింగ్ ద్వారా ABVP అభ్యర్థులు మొత్తం నాలుగు సెంట్రల్ పోస్టుల్లో విజయం సాధించారు.

ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా ABVP, NSUI (కాంగ్రెస్ మద్దతు), మరియు AISA-SFI కూటములతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రెసిడెంట్ పోస్టుకు ప్రధాన పోటీదారులు వీరే.,

  • యష్ దబాస్ - ABVP
  • విజయ్ శంకర్ మీనా - NSUI
  • అనన్య రతురి - AISA-SFI కూటమి

మొత్తం నాలుగు ప్రధాన పోస్టులకు గాను 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు (ప్రెసిడెంట్-7, వైస్ ప్రెసిడెంట్-5, సెక్రటరీ-4, జాయింట్ సెక్రటరీ-4). ఢిల్లీ వర్సిటీ వ్యాప్తంగా సుమారు 2.75 లక్షల మంది విద్యార్థులు ఈవీఎంల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో నార్త్, సౌత్ క్యాంపస్‌లలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
విద్యార్థుల తరగతుల సమయాలను బట్టి పోలింగ్‌ను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు.

  • ఉదయం షిఫ్ట్ (డే క్లాసెస్): ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు.
  • సాయంత్రం షిఫ్ట్ (ఈవినింగ్ క్లాసెస్): మధ్యాహ్నం 3:00 నుంచి రాత్రి 7:30 గంటల వరకు.

సెప్టెంబర్ 18 రాత్రితో పోలింగ్ ప్రక్రియ ముగియనుండగా.. సెప్టెంబర్ 19 ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ రోజే తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

TGPSC,APPSC ONLINE CLASSES :sakshi education app(click here)

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education