సాక్షి ఎడ్యుకేషన్: ఢిల్లీలోని Centre for Fire, Explosive and Environment Safety (సీఎఫ్‌ఈఈఎస్), Defence Research and Development Organisation ఆధ్వర్యంలో యూజీ, పీజీ విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం 15 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 5, 2026 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎంపికైన వారికి ఆరు నెలల పాటు నెలకు రూ.5,000 స్టైఫండ్ అందించనున్నారు.
- మొత్తం ఖాళీలు: 15
- ఇంటర్న్‌షిప్ వ్యవధి: 6 నెలలు
- స్టైఫండ్: నెలకు రూ.5,000/-
- వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు మించకూడదు.
- ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల విద్యార్హతలలో సాధించిన మార్కులు/మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తుకు చివరి తేదీ: 05-06-2026
ఈ ఇంటర్న్‌షిప్‌కు అప్లై చేయడానికి అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్/సైన్స్ కోర్సులలో యూజీ (UG) లేదా పీజీ (PG) చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
| క్రమ సంఖ్య | అర్హత కలిగిన సబ్జెక్టులు / విభాగాలు |
| 1 | ఎన్విరాన్మెంటల్ సైన్స్ / ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ |
| 2 | ఎలక్ట్రానిక్స్ / ఈసీఈ (ECE) / ఎలక్ట్రానిక్ టెలీకమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజినీరింగ్ |
| 3 | మెకానికల్ / ఆటోమేషన్ ఇంజినీరింగ్ |
| 4 | కెమికల్ ఇంజినీరింగ్ / కెమిస్ట్రీ |
| 5 | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (AI & ML) / డేటా సైన్స్ |
| 6 | కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE) / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) |

