డైరెక్టర్ జనరల్ ఏరోనాటికల్ సిస్టమ్స్ విభాగం కింద ఉన్న ల్యాబ్‌లలో 200 ఇంటర్న్‌షిప్ ఖాళీలు భర్తీ చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ మేరకు పెయిడ్ ఇంటర్న్‌షిప్ స్కీమ్-2026 నోటిఫికేషన్ విడుదలైంది.
DRDO ఏరోనాటికల్ సిస్టమ్స్ క్లస్టర్ పరిధిలోని 5 ప్రముఖ ల్యాబ్‌లలో మొత్తం 200 ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఉన్నాయి.
ల్యాబ్‌ల వారీ ఖాళీలు:
- ఏడీఈ (బెంగళూరు) - 69 పోస్టులు
- ఏడీఆర్‌డీఈ (ఆగ్రా) - 20 పోస్టులు
- సీఏబీఎస్ (బెంగళూరు) - 60 పోస్టులు
- సీఈఎంఐఎల్ఏసీ - 20 పోస్టులు
- జీటీఆర్‌ఈ (బెంగళూరు) - 31 పోస్టులు
ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన అర్హతలు:
ఇంజనీరింగ్ / సైన్స్ స్ట్రీమ్‌లలో చివరి సంవత్సరం UG లేదా PG విద్యార్థులు
కనీసం 6.5 CGPA తప్పనిసరి
- UG విద్యార్థులు: 6వ సెమిస్టర్ మార్క్‌షీట్ అవసరం
- PG విద్యార్థులు: 2వ సెమిస్టర్ మార్క్‌షీట్ అవసరం
ఫలితాలు ఇంకా రాలేదంటే:
- UG: 4వ & 5వ సెమిస్టర్ సగటు మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు
- PG: 1వ సెమిస్టర్ ఫలితాలు పరిగణిస్తారు
ఇంటర్న్‌షిప్ జాయినింగ్ సమయంలో సంబంధిత సెమిస్టర్ మార్క్‌షీట్లు తప్పనిసరి.
- అభ్యర్థుల సమాచారం, ఖాళీల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు
- సంబంధిత ల్యాబ్‌లు ఎంపికను నిర్ణయిస్తాయి
- ఎంపిక వివరాలు ఈమెయిల్ / SMS ద్వారా తెలియజేస్తారు
- ఇది పూర్తిగా ల్యాబ్‌ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది
- DRDO ఇంటర్న్‌షిప్‌కు ఉద్యోగ హామీ ఉండదు
- మొత్తం స్టైఫండ్: రూ. 30,000
చెల్లింపు విధానం:
- 3 నెలల తర్వాత - రూ. 15,000
- తదుపరి 3 నెలల తర్వాత - రూ. 15,000
ఇంటర్న్‌షిప్ మధ్యలో వదిలితే సర్టిఫికేట్ ఇవ్వబడదు.
- DRDO అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేయాలి
- 6 నెలల ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేయాలి
- కాలేజీ ప్రిన్సిపాల్ సంతకం తప్పనిసరి
- అవసరమైన డాక్యుమెంట్లు PDF ఫార్మాట్‌లో సంబంధిత ల్యాబ్‌కు ఈమెయిల్ చేయాలి
- ప్రతి ల్యాబ్‌కు విడిగా అప్లై చేయాలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చివరి తేదీ: జూన్ 5, 2026
వెబ్‌సైట్: www.drdo.gov.in
![]() ![]() | ![]() ![]() | ![]() |






