Dailyhunt
ఎన్నికల ఫలితాలు 2026 : రాష్ట్రాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు..?

ఎన్నికల ఫలితాలు 2026 : రాష్ట్రాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు..?

SAKSHI EDUCATION 1 week ago

మిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను వెనక్కి నెట్టి యాక్టర్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) సంచలన విజయం నమోదు చేసింది.

  • TVK: 108 స్థానాలు
  • DMK: 59 స్థానాలు
  • AIADMK: 47 స్థానాలు
  • కాంగ్రెస్: 5 స్థానాలు
  • PMK: 4 స్థానాలు

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) సునామీ సృష్టించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) అనూహ్యంగా కుప్పకూలింది. 200కు పైగా స్థానాలతో బీజేపీ బెంగాల్‌లో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

  • బీజేపీ (BJP): 206 స్థానాలు
  • టీఎంసీ (TMC): 80 స్థానాలు
  • కాంగ్రెస్: 2 స్థానాలు

కేరళలో వామపక్ష కూటమి (LDF)కి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇక్కడ బీజేపీ కూడా తన ఉనికిని చాటుకుంది.

  • కాంగ్రెస్: 63 స్థానాలు
  • CPI (M): 26 స్థానాలు
  • IUML: 22 స్థానాలు
  • CPI: 8 స్థానాలు
  • KEC: 7 స్థానాలు
  • బీజేపీ (BJP): 3 స్థానాలు

అస్సాంలో ముఖ్యమంత్రి వ్యూహాలు మరోసారి ఫలించాయి. బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి బంపర్ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది.

  • బీజేపీ (BJP): 82 స్థానాలు
  • కాంగ్రెస్: 19 స్థానాలు
  • BOPF: 10 స్థానాలు
  • AGP: 10 స్థానాలు
  • AIUDF: 2 స్థానాలు

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్‌సీ (AINRC) అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీతో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. విశేషమేమిటంటే, ఇక్కడ కూడా విజయ్ పార్టీ (TVK) రెండు స్థానాలు గెలుచుకుని బోణీ కొట్టింది.

  • AINRC: 12 స్థానాలు
  • DMK: 5 స్థానాలు
  • బీజేపీ (BJP): 4 స్థానాలు
  • స్వతంత్రులు: 3 స్థానాలు
  • TVK: 2 స్థానాలు
  • తమిళనాడులో సంబరాలు: టీవీకే అద్భుత విజయంతో చెన్నైతో సహా రాష్ట్రవ్యాప్తంగా విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలోనే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
  • బెంగాల్‌లో మమత రాజీనామా: ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. సీఎంగా ఎవరు బాధ్యతలు చేపడతారనే దానిపై బీజేపీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది.
  • కేరళ, అస్సాంలో సీఎల్పీ/ఎన్డీఏ భేటీలు: కేరళలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. అటు అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం అస్సాం గవర్నర్‌ను కలిసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.
  • పుదుచ్చేరిలో పొత్తుల లెక్కలు: ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం ఏఐఎన్ఆర్‌సీ మరియు బీజేపీ నేతలు స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education