- రిలయన్స్ ఇండస్ట్రీస్: శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో భారీ స్థాయిలో 6600 మెగావాట్ల ఏసీ/ 9000 డీసీ సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్రాజెక్టు.
- అదానీ హైడ్రో ఎనర్జీ ఎలెవన్ లిమిటెడ్: వైఎస్సార్ కడప జిల్లా గండికోటలో 2250 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు-2.
- క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్ సంస్థ: అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం కడలూరు, హుళికల్ గ్రామాల్లో 140.80 ఏసీ/ 211.20 డీసీ ప్రాజెక్టులు.
- క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్: నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లిలో 35 ఏసీ/ 52.50 డీసీ ప్రాజెక్టు.
- యమ్నాకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: తిరుపతి జిల్లాలో 89 కేటీపీఏ (KTPA) సామర్థ్యంతో ప్రతిష్టాత్మక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు.
- హెచ్‌పీసీఎల్ రెన్యువబుల్ అండ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్: ఏలూరు జిల్లా ముప్పవరంలో 20 టీపీడీ (TPD) కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్.
- IOCGPS రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కడింపొరవరంలో 15 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్.
- విభా బయోఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్: తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో 15 టీపీడీ బయోగ్యాస్ ప్లాంట్.
- డెల్టా బయోగ్యాస్ పల్నాడు టు ప్రైవేట్ లిమిటెడ్: పల్నాడు జిల్లా విప్పర్ల గ్రామంలో 12 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్.
- ఎనర్జియా బయోఫ్యూయెల్స్ ఎల్‌ఎల్‌పీ: తిరుపతి జిల్లా నాయడుపేట మండలం మెనకూరులో 12 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్.
- శ్రీ బాలాజీ బయో ఎనర్జీస్ అండ్ ఆర్గానిక్స్: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం సున్నంవారిచింతలలో 12 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్.
- అమృత శ్రీ బయో-సీఎన్‌సీ ప్రైవేట్ లిమిటెడ్: విజయనగరం జిల్లా వంగర మండలం తలగాం గ్రామంలో 12 టీపీడీ బయో-సీఎన్‌సీ ప్లాంట్.
- ప్రాజెక్టు స్థల మార్పు: క్రోమా-ఆటోర్ పవర్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టనున్న 200 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టును ఎడవల్లి గ్రామం నుంచి పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెం గ్రామానికి మారుస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
- భూమి లీజు పునరుద్ధరణ: శ్రీ సత్యసాయి జిల్లా ఎన్‌పీకుంట మండలం పి.కొత్తపల్లి గ్రామంలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం కేటాయించిన 325 ఎకరాల భూమి లీజు ఒప్పందం పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

