Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
GATE 2027 Registration: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారీ అవకాశం.. ఈ స్కోర్‌తో ఉద్యోగం, ఉన్నత విద్య రెండూ!

GATE 2027 Registration: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారీ అవకాశం.. ఈ స్కోర్‌తో ఉద్యోగం, ఉన్నత విద్య రెండూ!

SAKSHI EDUCATION 1 week ago

గేట్‌ 2027కు ఆగస్ట్‌ 14 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఈ ఏడాది మొత్తం 30 పేపర్లలో గేట్‌ను నిర్వహించనున్నారు. పరీక్ష కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో జరుగుతుంది.

ప్రతిఏటా లక్షల మంది విద్యార్థులు గేట్‌లో ప్రతిభ చూపి.. ఉన్నత విద్య, ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు ప్రిపరేషన్‌ సాగిస్తున్నారు.

బీటెక్‌ /బీఈ/బీఫార్మసీ/బీఆర్క్‌/బీఎస్సీ రీసెర్చ్‌/బీఎస్‌/ఆరేళ్ల ఫార్మ్‌-డి/ ఎంబీబీఎస్‌/బీడీఎస్‌/బీవీఎస్సీ/ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంసీఏ/ఇంటిగ్రేటెడ్‌ ఎంఈ/ఎంటెక్‌/ బీఏ/బీకాం/బీఎస్సీ తదితర ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఆయా కోర్సుల ప్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

గేట్‌-2027లో అన్ని పేపర్లకు సంబంధించి 15 నుంచి 20 శాతం మేరకు సిలబస్‌లో మార్పులు చేశారు. అదే విధంగా కొత్తగా రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ టెస్ట్‌ పేపర్‌ను చేర్చారు. గతంలో ఉన్న టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఫైబర్‌సైన్స్‌ పేపర్‌ను పూర్తి స్థాయి టెస్ట్‌ పేపర్‌కు బదులుగా ఇంజనీరింగ్‌ సైన్సెస్‌(ఎక్స్‌ఈ) విభాగంలో ఒక సెక్షనల్‌ పేపర్‌గా మార్పు చేశారు. దీంతో విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లు, టెస్ట్‌ పేపర్ల సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించడం మేలు.

గేట్‌-2027లో రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కల్పించారు. దీంతో విద్యార్థులు తమ అర్హతలకు సరితూగే రెండు పేపర్లలో పరీక్షకు హాజరు కావచ్చు. రెండో పేపర్‌ను నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట కాంబినేషన్స్‌లోనే ఎంచుకోవాల్సి ఉంటుంది.

  • గేట్‌ ప్రతి పేపర్‌ను పార్ట్‌-1, పార్ట్‌-2 పేరుతో రెండు విభాగాల్లో వంద మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 65 ప్రశ్నలు అడుగుతారు.
  • పార్ట్‌-1లో జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 10 ప్రశ్న­లు ఉంటాయి. ఈ విభాగానికి 15 మార్కులు కేటాయిస్తారు. ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి.
  • పార్ట్‌-2లో అభ్యర్థుల ఎంచుకున్న సబ్జెక్ట్‌లో 55 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 72 మార్కులు కేటాయిస్తారు.
  • పార్ట్‌-2లోనే ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌పై 13 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
  • ఏఆర్, సీవై, డీఏ, ఈవై, జీఈ, జీజీ, ఎంఏ, పీహెచ్, ఆర్‌ఏ, ఎస్‌టీ, ఎక్స్‌హెచ్, ఎక్స్‌ఎల్‌ పేపర్ల అభ్యర్థులకు ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌ విభాగం ఉండదు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో 15 మార్కులకు; సబ్జెక్ట్‌ విభాగంలో 85 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.

Railway Jobs 2026: డిగ్రీ అర్హతతో రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. రూ.35,400 ప్రారంభ వేతనం!

గేట్‌ పరీక్షలో మూడు రకాల ప్రశ్నలను అడుగుతారు. అవి.. మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌గా పిలిచే ఆబ్జెక్టివ్‌ కొశ్చన్స్‌. రెండో రకం మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌ (ఎంఎస్‌క్యూ). మూడోవి న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌(ఎన్‌ఏటీ) కొశ్చన్స్‌ ఉంటాయి. ఎంసీక్యూల్లో పేర్కొన్న ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌లో మాత్రం ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సమాధానంగా ఉంటాయి. న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్‌తో కూడినవి.

గేట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు ఖరారు చేసుకున్న వారికి పలు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఎంటెక్‌ వంటి పీజీ ప్రోగ్రామ్‌లో చేరితే నెలకు రూ.12,400, పీహెచ్‌డీలో చేరితో నెలకు రూ.28 వేల స్కాలర్‌షిప్‌ అందుతుంది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పీజీ ప్రవేశాల్లో గేట్‌ ఉత్తీర్ణులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. గేట్‌ స్కోర్‌తో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలను సైతం సొంతం చేసుకోవచ్చు.

గత కొన్నేళ్లుగా నవరత్న, మహారత్న, మినీరత్న వంటి హోదా పొందిన పీఎస్‌యూలు గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ, గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ వంటి పోస్ట్‌లను భర్తీ చేస్తున్నాయి. గేట్‌ స్కోర్‌తో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తున్నాయి. అనంతరం గ్రూప్‌ డిస్కషన్‌/గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. గేట్‌ స్కోర్‌కు, జీడీ/జీటీలకు నిర్దేశిత వెయిటేజీ కేటాయించి తుది జాబితా ప్రకటిస్తున్నాయి.

ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌+పీహెచ్‌డీ వంటి ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి గేట్‌ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే మలిదశలో ఆయా ఐఐటీలు.. గ్రూప్‌ పర్సనల్‌ టాస్క్, గ్రూప్‌ డిస్కషన్స్‌ను నిర్వహిస్తున్నాయి. పలు ఐఐటీలు ఎస్సేలు నిర్వహించే విధానాన్ని అనుసరిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే సీట్లు ఖరారు చేస్తున్నారు.

ISROలో 410 అప్రెంటిస్ పోస్టులు.. బీఈ/బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు భారీ అవకాశం!

ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ + పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం, అదే విధంగా పీఎస్‌యూ కొలువులకు షార్ట్‌ లిస్టింగ్‌ కోసం గేట్‌ స్కోర్‌ కటాఫ్‌ పెరుగుతోంది. జనరల్‌ కేటగిరీలో 750 నుంచి 800 స్కోర్, రిజర్వ్‌డ్‌ కేటగిరీలో 500 నుంచి 600 స్కోర్‌ పొందాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఈ స్కోర్లు సాధిస్తేనే మలి దశకు అవకాశం లభిస్తుంది.

  • ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్స్‌ వరకు పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి టాపిక్‌ను చదివేటప్పుడు అందులోని ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించాలి. వాటికి సంబంధించి ప్రాథమిక భావనలపై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో అవగాహన ఏర్పరచుకుని ఆ మేరకు సాధన చేయాలి. అదే విధంగా గేట్‌ అభ్యర్థులు ప్రిపరేషన్‌ సమయంలో అనుసంధాన విధానాన్ని అలవర్చుకోవాలి. గేట్‌ సిలబస్‌ను అకడమిక్‌ సిలబస్‌తో అన్వయించుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి.
  • డిసెంబర్‌ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్‌ పూర్తయ్యేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్‌ మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లకు హాజరవ్వాలి. ఇలా ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే టాప్‌ స్కోర్‌ సొంతం చేసుకోవచ్చు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 2026, ఆగస్ట్‌ 14 - సెప్టెంబర్‌ 21
  • పరీక్ష కేంద్రాల వెల్లడి: జనవరి 4, 2027
  • గేట్‌-2027 పరీక్ష తేదీలు: 2027 ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21
  • ఫలితాల వెల్లడి: 2027, మార్చి 19
  • వెబ్‌సైట్‌: https://gate2027.iitm.ac.in


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education