Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు TET తప్పనిసరి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఈ తేదీ వరకు గడువు పొడిగింపు!

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు TET తప్పనిసరి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఈ తేదీ వరకు గడువు పొడిగింపు!

SAKSHI EDUCATION 4 months ago

ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్‌ అర్హత సాధించాలంటూ స్పష్టం చేసింది. అయితే ఈ అర్హత పొందేందుకు చివరి గడువును 2028 ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ తుది అవకాశం ఇచ్చింది.

Anjuman Ishaat-e-Taleem Trust case సంబంధిత కేసులో వచ్చిన తీర్పుపై ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన 65కు పైగా రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌ల బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.

Right of Children to Free and Compulsory Education Act, 2009 (RTE చట్టం-2009) ప్రకారం చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయులు అవసరమని కోర్టు స్పష్టం చేసింది. పిల్లల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అర్హత లేని ఉపాధ్యాయులను కొనసాగించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.

AAICLAS Jobs: ఇంటర్ అర్హతతో ఎయిర్‌పోర్ట్‌లో 62 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే అవకాశం!

మునుపటి తీర్పులో ఇచ్చిన గడువును సవరించిన సుప్రీంకోర్టు, ఇన్‌ సర్వీస్‌ టీచర్లు టెట్‌ పరీక్షను 2028 ఆగస్టు 31లోపు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలంటూ ఆదేశించింది. ఇది చివరి అవకాశం అని, ఇకపై గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది.

2025లో ఇచ్చిన తీర్పును పునఃసమీక్ష చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సర్వీసులో కొనసాగాలంటే టెట్‌ తప్పనిసరి అన్న గత తీర్పును ధర్మాసనం మరింత బలపరిచింది.

ITI అర్హతతో హైదరాబాద్‌లో 33 అప్రెంటిస్ పోస్టులు.. మెరిట్ ఆధారంగా ఎంపిక!

రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా శాఖలు టెట్‌ పరీక్షలను ఏడాదికి కనీసం రెండు సార్లు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అర్హత పొందేందుకు ఉపాధ్యాయులకు తగిన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని కూడా స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ అర్హత ఇక తప్పనిసరిగా మారింది. 2028 ఆగస్టు 31 తర్వాత అర్హత లేకుండా సర్వీసులో కొనసాగడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education