Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Indian Army: ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌-56లో ప్రవేశాలు

Indian Army: ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌-56లో ప్రవేశాలు

SAKSHI EDUCATION 4 days ago

వివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్‌లో MPC చదివిన విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

90 అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ (PCM) సబ్జెక్టులతో 10+2 లేదా సమాన అర్హతలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.

అలాగే JEE Mains-2026 స్కోర్‌ తప్పనిసరిగా ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి.

01 జనవరి 2027 నాటికి 16½ నుంచి 19½ సంవత్సరాల మధ్య ఉండాలి.

  • శిక్షణ కాలంలో మిలిటరీ సర్వీస్ పే కింద నెలకు సుమారు రూ.15,500 స్టైపెండ్‌ అందుతుంది.
  • మూడేళ్ల శిక్షణ అనంతరం రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు మూల వేతనం లభిస్తుంది. అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ మరియు ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు.

అభ్యర్థుల ఎంపికను కింది దశల ఆధారంగా నిర్వహిస్తారు:

  • JEE Mains-2026 స్కోర్‌
  • Stage-1 పరీక్ష
  • Stage-2 పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • మెడికల్‌ ఎగ్జామినేషన్‌
  • ఈ కోర్సు మొత్తం 4 సంవత్సరాలు కొనసాగుతుంది.
  • మొదటి మూడు సంవత్సరాలు పుణె, సికింద్రాబాద్‌లోని ఆర్మీ శిక్షణ కేంద్రాల్లో బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్‌ మరియు B.Tech టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు.
  • చివరి ఏడాది డెహ్రాడూన్‌లోని Indian Military Academy (IMA)లో శిక్షణ ఉంటుంది.
  • శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి BE/B.Tech డిగ్రీ ప్రదానం చేస్తారు. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాలో ఇండియన్‌ ఆర్మీలో నియామకం కల్పిస్తారు.

అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

12 జూన్‌ 2026
వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in

>> HAL Jobs: హెచ్‌ఏఎల్‌ హైదరాబాద్‌లో 132 అప్రెంటిస్‌ ఉద్యోగాలు.. డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులకు భారీ అవకాశం!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education