Dailyhunt
ఇండియా - శ్రీలంక నౌకాదళాల మధ్య 'IN-SLN DIVEX 2026' విన్యాసాలు.. ప్రధాన లక్ష్యం..?

ఇండియా - శ్రీలంక నౌకాదళాల మధ్య 'IN-SLN DIVEX 2026' విన్యాసాలు.. ప్రధాన లక్ష్యం..?

SAKSHI EDUCATION 1 week ago

  • లోతైన సముద్రపు డైవింగ్: రెండు దేశాల డైవర్లు 55 మీటర్ల కంటే ఎక్కువ లోతులో డైవింగ్ చేసి తమ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
  • మిశ్రమ గ్యాస్ డైవింగ్: సంక్లిష్టమైన నీటి అడుగున మిషన్ల కోసం కీలకమైన 'మిక్స్డ్ గ్యాస్ డైవింగ్' డ్రిల్స్‌ను నిర్వహించారు.

  • చారిత్రక ప్రాధాన్యత: రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి చారిత్రక నౌకల శిథిలాలు (SS Worcester, SS Perseus) ఉన్న ప్రాంతాల్లో ఈ విన్యాసాలు చేపట్టడం విశేషం.
  • ఈ విన్యాసాలు కేవలం సైనిక శిక్షణకే పరిమితం కాకుండా, ఇరు దేశాల మధ్య రక్షణ దౌత్యాన్ని మరింత బలోపేతం చేశాయి. శ్రీలంక రియర్ అడ్మిరల్ SJ కుమార INS నిరీక్షక్‌ను సందర్శించి, శ్రీలంక డైవర్లకు భారత్ అందిస్తున్న శిక్షణను అభినందించారు.
  • అంతేకాకుండా, నౌకాదళ సిబ్బంది మధ్య స్నేహపూర్వక సంబంధాల కోసం గాలే ఫేస్ వద్ద బీచ్ క్లీనింగ్ డ్రైవ్, యోగా సెషన్లు మరియు క్రీడా పోటీలను నిర్వహించారు.
  • భారత్ తన 'ఆరోగ్య మైత్రి' చొరవలో భాగంగా శ్రీలంకకు BHISM క్యూబ్స్ (పోర్టదుల్ మెడికల్ యూనిట్లు) అందజేసింది. విపత్తుల సమయంలో తక్షణ వైద్య సహాయం అందించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
  • ప్రాంతీయ భద్రతతో పాటు మానవతా దృక్పథంతో భారత్ వ్యవహరిస్తున్న తీరుకు ఇది నిదర్శనం.
  • విన్యాసం పేరు: IN-SLN DIVEX 2026 (4వ ఎడిషన్).
  • పాల్గొన్న దేశాలు: భారత్ మరియు శ్రీలంక.
  • వేదిక: కొలంబో, శ్రీలంక.
  • తేదీలు: 21 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్, 2026.
  • భారత నౌక: INS నిరీక్షక్.
  • ప్రధాన లక్ష్యం: సముద్ర భద్రత, ఇరు దేశాల నౌకాదళాల మధ్య సమన్వయం (Interoperability).
  • మానవతా సాయం: భారత్ అందించిన BHISM మెడికల్ క్యూబ్స్.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education