Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండోనేసియాతో భారత్ చారిత్రక రక్షణ, వ్యూహాత్మక ఒప్పందాలు... బ్రహ్మోస్ ఎగుమతి, ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం..!

ఇండోనేసియాతో భారత్ చారిత్రక రక్షణ, వ్యూహాత్మక ఒప్పందాలు... బ్రహ్మోస్ ఎగుమతి, ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం..!

SAKSHI EDUCATION 1 week ago
  • బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల ఎగుమతి: సుమారు రూ.5,694 కోట్ల విలువైన ఒప్పందంతో ఇండోనేసియాకు సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణి 'బ్రహ్మోస్', గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే 'అస్త్ర' క్షిపణులను భారత్ సరఫరా చేయనుంది.
  • సబాంగ్ నౌకాశ్రయం : మలక్కా జలసంధి సమీపంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సబాంగ్ పోర్ట్‌ను భారత్, ఇండోనేసియాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. ఇది భారత 'గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్'కు కేవలం 100 మైళ్ల దూరంలో ఉండటం వ్యూహాత్మకంగా భారత్‌కు కలిసొచ్చే అంశం.
  • సముద్రయాన భద్రత : హిందూ మహాసముద్ర ప్రాంతంలోని భారత 'ఇంటిగ్రేటెడ్ ఫ్యూజన్ సెంటర్‌'లోకి ఇండోనేసియా తమ 'లియేసన్ ఆఫీసర్‌'ను నియమించేందుకు అంగీకారం కుదిరింది.
  • యూపీఐ అనుసంధానం: ఇండోనేసియా చెల్లింపుల వ్యవస్థతో భారతదేశపు 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్' అనుసంధానం కానుంది. దీనిద్వారా ఇండోనేసియా పౌరులకు యూపీఐ సేవలు అందుబాటులోకి వస్తాయి.
  • ఐఐఎం బెంగళూరు క్యాంపస్: ఇండోనేసియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్‌లో ఉన్న సింఘసారీ స్పెషల్ ఎకనమిక్ జోన్‌లో ప్రతిష్టాత్మక 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్' బ్రాంచ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
  • పెట్టుబడులు - సరఫరా గొలుసు: ఉక్కు, నికెల్, అరుదైన భూ అయస్కాంతాలు మరియు ఇతర మూలకాల సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి ఇండోనేసియా పరిశ్రమల్లో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది.
  • ఎన్నికల నిర్వహణ: ఎన్నికల నిర్వహణ అనుభవాన్ని పంచుకోవడంతో పాటు, ఇండోనేసియాకు ఈవీఎంల ఎగుమతికి సంబంధించి ఇరుదేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
  • ఇరుదేశాల మధ్య సత్సంబంధాల బలోపేతానికి మోదీ చేస్తున్న కృషికి గుర్తింపుగా, ఇండోనేసియా ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారం 'బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా' తో ప్రధాని మోదీని సత్కరించింది. అధ్యక్షుడు సుబియంతో స్వయంగా ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు.
  • యోగాకర్త నగరంలోని ప్రపంచ వారసత్వ సంపదైన వెయ్యేళ్ల నాటి అతిపెద్ద శివాలయం 'ప్రాంభనన్'ను ప్రధాని మోదీ సందర్శించారు. 10వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయ కాంప్లెక్స్ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో భారత్ పాలుపంచుకోనుంది.
  • "సంస్కరణలు, పనితీరు, పెనుమార్పు మంత్రంతో భారత్ ముందుకు దూసుకెళ్తోంది."
  • "భారత్ ఏనాడైనా అభివృద్ధి బాటనే అనుసరిస్తుంది. రాజ్య విస్తరణవాదం వైపు అస్సలు నడవదు." (చైనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ).
  • "స్వేచ్ఛాయుత, పారదర్శకమైన, సమ్మిళిత ఇండో-పసిఫిక్ కోసం భారత్ ఎల్లప్పుడూ కృషిచేస్తుంది."
  • "గత ఏడాది భారత పర్యటన ముగించుకుని తిరిగిరాగానే జన్యక్రమ విశ్లేషణ (DNA) పరీక్ష చేయించుకున్నా. నాలో భారతీయ డీఎన్‌ఏ ఉన్నట్లు నిర్ధారణ అయింది."
  • "భారత్‌లో ప్రధాని మోదీ చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అచ్చుగుద్దినట్లు ఇండోనేసియాలో నేను కాపీ చేసి అమలు చేస్తున్నాను, దీన్ని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించను."

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education