- రికార్డుల ప్రకారం, ఖమేనీ పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా, కింతూర్ గ్రామానికి చెందినవారు.
- ఆయన తాత సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ 1800 ప్రాంతంలో యూపీలోనే జన్మించారు.
- 1830లో మతపరమైన ఉన్నత విద్య కోసం ఇరాక్‌లోని నజాఫ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
- భారతీయ మూలాలకు గుర్తుగా ఇరాన్ అధికారిక రికార్డుల్లో ఇప్పటికీ ఆయన పేరులో 'హిందీ' అనే పదం కొనసాగుతోంది.
- ఖమేనీ మరణంతో కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లా, అలిపురా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- 1986 పర్యటన: ఖమేనీ గతంలో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు అలిపురాను సందర్శించారు.
- ఆయన గౌరవార్థం ఆ గ్రామంలో ఒక ఆసుపత్రిని కూడా నిర్మించారు.
- అలిపురాలోని సుమారు 30,000 మంది జనాభాలో అత్యధికులు షియా ముస్లింలే కావడంతో, వారు ఖమేనీని తమ ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు. ఆయన మృతికి సంతాపంగా గ్రామంలో మూడు రోజుల పాటు వ్యాపార సంస్థలను మూసివేసి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
ఖమేనీ మరణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా, భారత్‌తో ఆయన కుటుంబానికి ఉన్న అనుబంధం ఇప్పుడు మరింతగా వెలుగులోకి వచ్చింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

