ఈ సందర్భంగా JNTU Anantapur ఉపకులపతి డా. హెచ్. సుదర్శనరావు మాట్లాడుతూ..., విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య, జర్మన్ భాషా శిక్షణ, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
CSE విద్యార్థులు MSc Professional Software Engineering, ECE/EEE/Mechanical విద్యార్థులు MSc in Digital Business Management కోర్సులను అభ్యసించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే రిజిస్ట్రార్ డా. ఎస్. కృష్ణయ్య మాట్లాడుతూ.., ఎంఓయూ అనంతరం ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 2026 ఆగస్టు 7. కౌన్సెలింగ్ 2026 ఆగస్టు 10న నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు https://www.jntua.ac.in/#pg=notif-files వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 7702768080, 7891488999, 7891588999 హెల్ప్‌డెస్క్ నంబర్లను సంప్రదించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ బంగారు బాటకు.. సరైన దారిని ఎంపిక చేసుకోండి.

