JNTU Hyderabad మరియు University of Kassel సంయుక్తంగా అందిస్తున్న రెండేళ్ల డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ 'రిన్యూవబుల్స్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్ (REMENA)' ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యాభ్యాసం చేసే ప్రత్యేక అవకాశం లభించనుంది.
ఇందులో విద్యార్థులు 6 నెలలు JNTUHలో, మిగతా 1½ సంవత్సరాలు జర్మనీలోని కాసెల్ విశ్వవిద్యాలయంలో చదువుతారు. మాస్టర్స్ థీసిస్ కూడా జర్మనీలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.
1. బీటెక్ / బీఈలో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి.
2. మెకానికల్, ఈఈఈ, కెమికల్, ప్రొడక్షన్, మెటలర్జీ, ఆటోమొబైల్ వంటి విభాగాల విద్యార్థులు అర్హులు.
3. సంబంధిత రంగంలో పని అనుభవం 1 సంవత్సరం తప్పనిసరి ఉండాలి.
జర్మనీలో చదువు పూర్తి చేసిన విద్యార్థులు 18 నెలల వరకు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లభించిన తర్వాత EU Blue Card లేదా దీర్ఘకాల నివాస అనుమతికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు వచ్చే వారంలో ప్రకటించబడనున్నాయి. ఈలోపు కోర్స్ వివరాలు మరియు అడ్మిషన్ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనుకునే వారు అధికారిక హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు. ఈ ప్రోగ్రామ్ అధికారిక కోఆర్డినేటర్లు ప్రతి బుధవారం, శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటారు. అలాగే మిగిలిన రోజులలో కూడా ఫోన్ ద్వారా సంప్రదించే అవకాశం ఉంటుంది.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : 9044115999 , 9044117999
వేదిక: Directorate of Admissions, JNTUH, కూకట్‌పల్లి, హైదరాబాద్

