Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Job Mela: తెలంగాణ యువతకు ఉద్యోగాల పండుగ.. ఈ 5 జిల్లాల్లో అప్రెంటిస్‌షిప్-కమ్-జాబ్ మేళా!

Job Mela: తెలంగాణ యువతకు ఉద్యోగాల పండుగ.. ఈ 5 జిల్లాల్లో అప్రెంటిస్‌షిప్-కమ్-జాబ్ మేళా!

SAKSHI EDUCATION 2 weeks ago

జూలై 6 నుంచి జూలై 14 వరకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. Skill India Mission, National Apprenticeship Promotion Scheme (NAPS-2) ఆధ్వర్యంలో "Your Skills, Your Future, Our Mission" అనే థీమ్‌తో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ జాబ్ మేళా ద్వారా వృత్తి విద్య పూర్తి చేసిన విద్యార్థులు, ఇటీవల ఉత్తీర్ణులైన యువతకు ప్రముఖ పరిశ్రమల్లో అప్రెంటిస్‌షిప్‌తో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు:

  • ప్రముఖ కంపెనీల్లో ప్రత్యక్ష ఇంటర్వ్యూలు
  • కెరీర్ కౌన్సెలింగ్, నిపుణుల మార్గదర్శకత్వం
  • పారామెడికల్, నాన్-పారామెడికల్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు
  • అప్రెంటిస్‌షిప్ శిక్షణ పొందే వారికి నెలకు రూ.9,600 స్టైపెండ్

అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

AIతో ఉద్యోగాల్లో భారీ మార్పులు.. నికేష్ అరోరా కీలక వ్యాఖ్యలు!

ఈ కార్యక్రమానికి కింది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • IPE మార్చి 2026 లేదా IPASE జూన్ 2026లో ఉత్తీర్ణులైన ఫ్రెషర్లు
  • గత మూడు విద్యా సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ వృత్తి విద్య పూర్తి చేసిన అభ్యర్థులు

ఇప్పటికే అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన లేదా ప్రస్తుతం అప్రెంటిస్‌షిప్‌లో ఉన్న అభ్యర్థులు అర్హులు కారు.

  • జూలై 6: ఎస్‌కేపీఎం ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాశాల, కుత్బుల్లాపూర్, మెడ్చల్-మల్కాజ్‌గిరి
  • జూలై 7: కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాల, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్
  • జూలై 13: ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాశాల, హనుమకొండ
  • జూలై 14: ప్రభుత్వ వృత్తి జూనియర్ కళాశాలలు, మహబూబ్‌నగర్, నల్గొండ

పారామెడికల్ విభాగం ఉదయం సెషన్‌లో, నాన్-పారామెడికల్ విభాగం మధ్యాహ్నం సెషన్‌లో నిర్వహించబడుతుంది.

Good News: 7,000 ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్!

అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్‌షిప్ చట్టం-1961 నిబంధనల ప్రకారం నెలకు రూ.9,600 స్టైపెండ్ అందజేయబడుతుంది. శిక్షణతో పాటు పరిశ్రమల్లో పని అనుభవం కూడా లభించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు కింది పత్రాలను వెంట తీసుకురావాలి.

  • బయోడేటా (2 ప్రతులు)
  • విద్యార్హత సర్టిఫికెట్లు (అసలు & జిరాక్స్)
  • ఆధార్ కార్డు
  • అవసరమైన ఇతర గుర్తింపు పత్రాలు

తెలంగాణలో వృత్తి విద్య పూర్తి చేసిన యువతకు ఈ అప్రెంటిస్‌షిప్-కమ్-జాబ్ మేళా 2026 మంచి అవకాశంగా నిలవనుంది. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమల్లో అనుభవం, స్టైపెండ్‌తో కూడిన శిక్షణ ఒకే వేదికపై లభించనున్నందున అర్హులైన అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education