సాక్షి ఎడ్యుకేషన్: ప్రముఖ సంస్థ మాయాస్త్ర (Maayasthra) సంస్థ ప్రతిభావంతులైన UI/UX డిజైనర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగం పూర్తిగా వర్క్ ఫ్రం హోం విధానంలో ఉంటుంది.
దీనికి ఎలాంటి అనుభవం అవసరం లేకుండా ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. కాబట్టి కొత్తగా కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.4,00,000 నుంచి రూ.9,00,000 వరకు వేతనం (CTC) అందించబడుతుంది. వెంటనే పనిలో చేరడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మే 3వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
- పోస్ట్: UI/UX డిజైనర్ (Fresher)
- కంపెనీ: Maayasthra
- పని విధానం: Work From Home
- ప్రారంభ తేదీ: వెంటనే (Immediately)
- అనుభవం: అవసరం లేదు
- జీతం (CTC): రూ.4,00,000 - రూ.9,00,000 సంవత్సరానికి
- చివరి తేదీ: 3 మే 2026
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులకు కింది సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన ఉండాలి,
- డిజైన్ టూల్స్: Figma, Adobe Illustrator, Adobe Photoshop వాడకంలో ప్రావీణ్యం.
- కోర్ స్కిల్స్: UI & UX డిజైన్, వైర్‌ఫ్రేమింగ్ (Wireframing), ప్రోటోటైపింగ్ (Prototyping).
- ఇంటరాక్షన్ డిజైన్: యూజర్ ఇంటరాక్షన్‌లను సులభతరం చేసే డిజైన్లను రూపొందించడం.

