సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో మే 23వ తేదీ(శనివారం) ఉదయం 10:00 గంటలకు భారీ జాబ్ మేళా జరగనుంది.
ఈ ఉద్యోగ మేళా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐనవిల్లి మండలం, నెడునూరులోని రవి ఫౌండేషన్ ప్రాంగణంలో జరుగుతుంది. వివిధ ప్రముఖ కంపెనీలు పాల్గొని టెక్నీషియన్, ఆపరేటర్, ఫార్మసిస్ట్, కెమిస్ట్, ఇన్సూరెన్స్ అడ్వైజర్ వంటి పోస్టులకు నియామకాలు చేపడుతున్నాయి. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఈ జాబ్‌మేళాలో పాల్గొనే సంస్థలు, ఖాళీల వివరాలు ఇవే..
| క్రమ సంఖ్య | సంస్థ పేరు | ఉద్యోగ హోదా | అర్హతలు | పని ప్రదేశం | జీతం | ఖాళీలు |
|---|---|---|---|---|---|---|
| 1 | అవంతి ఫుడ్స్ ఫ్రోజెన్ ప్రైవేట్ లిమిటెడ్ (AVANTHI Foods Frozen Pvt. Ltd) | ప్రొడక్షన్ / పర్చేస్ సూపర్వైజర్స్ | ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా | రావులపాలెం | రూ.13,500 + అలవెన్సులు | 35 |
| 2 | ఆన్‌లైన్ QC | బి.ఎస్‌సి ఫిషరీస్ / పీజీ | రావులపాలెం | రూ.13,500 + అలవెన్సులు | 10 | |
| 3 | ప్లాంట్ / స్టోర్ బాయ్స్ | SSC పాస్ / ఫెయిల్ | రావులపాలెం | రూ.13,500 + అలవెన్సులు | 10 | |
| 4 | కోల్డ్ స్టోరేజ్ ఇన్చార్జ్ | కోల్డ్ స్టోరేజ్ అనుభవం | రావులపాలెం | రూ.13,500 - రూ.20,000 | 30 | |
| 5 | టాటా ఎలక్ట్రానిక్స్ (TATA Electronics) | జూనియర్ టెక్నీషియన్ | డిప్లొమా / ఐటీఐ / SSC / డిగ్రీ | హోసూర్, తమిళనాడు | రూ.19,121 CTC | 80 |
| 6 | ఫాక్స్‌కాన్ (FOXCONN) | ఆపరేటర్ | SSC మరియు పై చదువులు | బెంగళూరు | రూ.15,200 + ఫుడ్ | 50 |
| 7 | అపోలో ఫార్మసీ (Apollo Pharmacy) | ఫార్మసిస్ట్ | D/B/M Pharmacy | మండపేట, భీమవరం, పాలకొల్లు | రూ.17,600 CTC | 10 |
| 8 | అపోలో ఫార్మసీ (Apollo Pharmacy) | ఫార్మసీ అసిస్టెంట్ | SSC నుండి ఏదైనా డిగ్రీ | రావులపాలెం | రూ.15,900 CTC | 20 |
| 9 | అపోలో ఫార్మసీ (Apollo Pharmacy) | ఫార్మసీ ట్రైనీ | SSC నుండి ఏదైనా డిగ్రీ | రావులపాలెం | రూ.14,700 CTC | 30 |
| 10 | డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Deccan Fine Chemicals India Pvt. Ltd.) | కెమిస్ట్ | B.Sc / M.Sc కెమిస్ట్రీ | అనకాపల్లి | రూ.2.33 LPA | 50 |
| 11 | అపోలో టైర్స్ లిమిటెడ్ (APOLLO TYRES LTD) | టెక్నీషియన్ | ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ | శ్రీ సిటీ, నెల్లూరు | రూ.14,000 - రూ.17,000 | 60 |
| 12 | ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ (INDUS COFFEE PVT. LTD) | టెక్నీషియన్ / ఆపరేటర్ | SSC / ITI / డిప్లొమా / B.Tech / డిగ్రీ | సుల్లూరుపేట, తాడా | రూ.15,500 + ఫుడ్ | 100 |
| 13 | హ్యుందాయ్ మొబిస్ (HYUNDAI MOBIS) | టెక్నీషియన్ | ITI / డిప్లొమా / B.Tech / డిగ్రీ | అనంతపురం | రూ.13,200 నెలకు | 50 |
| 14 | టీవీఎస్ (TVS) | ఆపరేటర్ | SSC / ఇంటర్ / డిగ్రీ / ITI / డిప్లొమా | హోసూర్, తమిళనాడు | రూ.16,730 + ఫుడ్ & ట్రాన్స్‌పోర్ట్ | 85 |
| 15 | టాటా ఏఐఏ (TATA AIA) | లీడర్స్ / ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ | SSC / ఇంటర్ / డిగ్రీ / డిప్లొమా | కోనసీమ జిల్లా | రూ.15,000 - రూ.20,000 | 100 |
- తేదీ: 22-05-2026
- స్థలం: Ravi Foundation, నెడునూరు, కోనసీమ జిల్లా
- సంప్రదించండి: 8247645389, 9988853335, 8712655686, 8790118349

