Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీ ప్లాన్ వీళ్ళలా ఉంటే...21 ఏళ్లకు IAS అవడం సాధ్యమే...!

మీ ప్లాన్ వీళ్ళలా ఉంటే...21 ఏళ్లకు IAS అవడం సాధ్యమే...!

SAKSHI EDUCATION 6 months ago

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE)కు దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, కనీస విద్యార్హత డిగ్రీ.

కాబట్టి మీ ప్రిపరేషన్ ను డిగ్రీ పూర్తయ్యాక కాకుండా, ఇంటర్మీడియట్ స్థాయి (10+2) నుంచే సరైన ప్రణాళికతో సిద్ధమైతే, మీ తొలి ప్రయత్నంలోనే IAS అయ్యే అవకాశం ఉంది. దీనికై సాక్షి ఎడ్యుకేషన్ నుంచి ఒక సమగ్ర ప్లాన్ మీకోసం ఇక్కడ ఉంది. ఈ మార్గదర్శకాలను అనుసరించి, మీ కలను సాకారం చేసుకునే దిశగా బలంగా అడుగులు వేయండి...

  • ఇంటర్మీడియట్ (10+2) పూర్తి చేసిన వెంటనే, మీరు డిగ్రీ(B.Sc లేదా B.Com లేదా B.Tech)లో ప్రవేశించాలి. ఈ సమయంలోనే UPSC సిలబస్‌ను అధ్యయనం చేయడం ప్రారంభించాలి.
  • డిగ్రీ (3 సంవత్సరాల కోర్సు) పూర్తి చేసే సమయానికి మీకు 21 ఏళ్లు నిండుతాయి. సరిగ్గా అదే సంవత్సరం UPSC పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి.

మీరు 21 ఏళ్లకే విజయం సాధించాలంటే, డిగ్రీ పూర్తయిన తర్వాత కాకుండా, డిగ్రీ చదువుతున్నప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి.

  • సిలబస్ అవగాహన: UPSC సిలబస్ (ముఖ్యంగా జనరల్ స్టడీస్) & పరీక్షా విధానంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
  • NCERT బుక్స్: 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్న సోషల్ సైన్సెస్ (చరిత్ర, భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం) NCERT పుస్తకాలను చవవాలి. దీంతో మీకు ప్రాథమిక భావనల(ఫండమెంటల్ కాన్సెప్ట్స్) పై మీకు ఒక అవగాహన వస్తుంది.
  • ప్రామాణిక పుస్తకాలు: ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రామాణిక (Standard) పుస్తకాలను చదవడం ప్రారంభించాలి (ఉదా: లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ).
  • కరెంట్ అఫైర్స్: రోజూ వార్తాపత్రికలు (సాక్షి దినపత్రిక, హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటివి) చదవడం అలవాటు చేసుకోవాలి.
  • నోట్స్ మేకింగ్: ముఖ్యమైన అంశాలకు సంబంధించిన నోట్స్ తయారు చేసుకోవాలి.
  • రివిజన్: చదివిన అన్ని అంశాలను వేగంగా పునశ్చరణ(రివిజన్) చేయాలి.
  • ప్రాక్టీస్: ప్రిలిమ్స్ కోసం టెస్ట్ సిరీస్‌లు, మెయిన్స్ కోసం సమాధానాలు రాసే పద్ధతి (Answer Writing Practice)పై దృష్టి పెట్టాలి.
  • ఆప్షనల్ సబ్జెక్ట్: ఆప్షనల్ సబ్జెక్ట్‌ను పూర్తి చేసి, దానిని పదే పదే రివైజ్ చేయాలి.

సివిల్ సర్వీసెస్ పరీక్షలో మూడు దశలు ఉంటాయి. మీరు ప్రతి దశను అత్యంత వేగంగా & పకడ్బందీగా పూర్తి చేయాలి:

1. ప్రిలిమ్స్మే/జూన్ (డిగ్రీ ఫైనల్ ఇయర్/పూర్తయిన వెంటనే)జనరల్ స్టడీస్ (GS) & CSAT. కచ్చితత్వం (Accuracy) & వేగం చాలా ముఖ్యం.
2. మెయిన్స్సెప్టెంబర్/అక్టోబర్సమాధానాల నిర్మాణం, విశ్లేషణ, లోతైన జ్ఞానం &సమయ పాలన ఉండాలి.
3. ఇంటర్వ్యూతదుపరి సంవత్సరం మార్చి/ఏప్రిల్వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, కరెంట్ అఫ్ఫైర్స్ , DAF ఆధారిత ప్రశ్నలకు సన్నద్ధం అయి ఉండాలి.
  • సరైన మెంటార్‌షిప్: మెంటార్‌షిప్ కోసం అనుభవజ్ఞులైన మెంటార్‌లను లేదా శిక్షణా సంస్థలను సంప్రదించాలి.
  • ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంపిక: మీకు ఆసక్తి ఉన్న & డిగ్రీలో చదివిన సబ్జెక్టును ఎంచుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది.
  • ఆరోగ్యం: UPSC అనేది సుదీర్ఘ ప్రిపరేషన్ ప్రక్రియ కాబట్టి, శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
  • UPSC లో విజయజయం సాధించిన అభ్యర్థులలో 21-24 సంవత్సరాల వయస్సు గలవారు సుమారు 16.2% ఉన్నారు. అయితే, అత్యధికంగా 24-26 సంవత్సరాల వయస్సు గలవారు 30.5% మంది ఉన్నారు.
  • విజయం సాధించిన అభ్యర్థుల సగటు వయస్సు సాధారణంగా 26-27 సంవత్సరాల మధ్య ఉంటుంది, చాలా మంది 2-3 ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు.
  • పరీక్షకు హాజరు కావడానికి మీకు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. కాబట్టి, 21 ఏళ్లకే విజయం సాధించాలంటే, మీరు డిగ్రీ పూర్తయిన తర్వాత మీ మొదటి ప్రయత్నంలోనే పరీక్షను క్లియర్ చేయాలి.
  • 21 ఏళ్లకే విజయం సాధించాలంటే, కళాశాల (College) రోజుల్లోనే పూర్తి ఏకాగ్రతతో, ప్రతి అంశం పట్ల స్పష్టత (Conceptual Clarity) & నిరంతర ప్రిపరేషన్‌ (Consistency) అవసరం.
  • 21 ఏళ్లకే IAS కావడానికి అవకాశం ఉన్నప్పటికీ, ఎక్కువ మంది విజేతలు కొంచెం ఎక్కువ వయస్సు వారుగా ఉన్నారు. దీనికి కారణం, పరీక్షలో పట్టు సాధించడానికి ఎక్కువ అనుభవాన్ని లేదా ఎక్కువ ప్రయత్నాలను తీసుకోవడమే.

21 ఏళ్లకే IPS అయితే...DGP అవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా...?

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education