Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2.0 | 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆర్థిక సహాయం

ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2.0 | 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆర్థిక సహాయం

SAKSHI EDUCATION 4 months ago

సాక్షి ఎడ్యుకేషన్: వాల్వోలైన్ కమ్మిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (VCPL) ఆధ్వర్యంలో ముస్కాన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2.0 (2026-27) కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ స్కాలర్‌షిప్ ద్వారా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక చేయూత లభిస్తుంది. ముఖ్యంగా కమర్షియల్ డ్రైవర్లు (LMV/HMV), మెకానిక్‌ల పిల్లలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) చెందిన విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు వాస్తవ విద్యా ఖర్చుల ఆధారంగా రూ.12,000 వరకు స్కాలర్‌షిప్‌తో పాటు రోడ్ సేఫ్టీపై మెంటార్‌షిప్ సెషన్ కూడా అందించబడుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 20 ఆగస్టు 2026.

  • తరగతి & రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, బీహార్, అసోం వంటి నిర్దేశిత రాష్ట్రాలలో 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
  • కుటుంబ నేపథ్యం: కమర్షియల్ వాహనాల డ్రైవర్లు, ఆటోమొబైల్ మెకానిక్‌ల పిల్లలు లేదా EWS వర్గానికి చెందిన వారై ఉండాలి.
  • విద్యా అర్హత: అభ్యర్థులు తమ క్రితం తరగతి (Previous Class) పరీక్షల్లో కనీసం 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
  • కుటుంబ ఆదాయం: అన్ని వనరుల నుండి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు.
  • మినహాయింపు: వాల్వోలిన్ కమిన్స్ (VCPL) & బడ్డీ4స్టడీ (Buddy4Study) ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు కారు.
  • విద్యార్థి అసలు విద్యా ఖర్చుల ఆధారంగా ఏడాదికి గరిష్టంగా రూ.12,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది.
  • వ్యక్తిత్వ వికాసంతో పాటు రోడ్డు భద్రత (Road Safety) అంశాలపై నిపుణులతో ఉచిత మెంటర్‌షిప్ లభిస్తుంది.
  • చివరి తేదీ: 20 ఆగస్టు 2026
  • దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు లింక్: www.b4s.in/yeks/MKSP3
  • క్యూఆర్ కోడ్:https://dle9eg0t055l3.cloudfront.net/static/images/scho-media/bharti-airtel-scholarship-2026-271782798788.png
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education