Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NEET ప్రశ్నపత్రం లీక్‌ ప్రభావం.. NTAలో కీలక మార్పులు!

NEET ప్రశ్నపత్రం లీక్‌ ప్రభావం.. NTAలో కీలక మార్పులు!

SAKSHI EDUCATION 6 days ago

ఇందులో భాగంగా ఎన్‌టీఏలో పనిచేస్తున్న జాయింట్‌ డైరెక్టర్లను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసినట్లు సమాచారం. ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల నిర్వహణ వ్యవస్థపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

మెడికల్‌ ప్రవేశ పరీక్ష అయిన NEET నిర్వహణపై ఇటీవల తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రశ్నపత్రం లీక్‌ ఆరోపణలు, పరీక్షా కేంద్రాల వద్ద అవకతవకలు, విద్యార్థుల ఆందోళనలతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షల పారదర్శకతపై ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది.

1865 Bank Jobs: డిగ్రీ అర్హతతో యూనియన్‌ బ్యాంకులో 1,865 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

పరీక్షల నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఎన్‌టీఏలో కీలక అధికారుల మార్పులు చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా జాయింట్‌ డైరెక్టర్ల బదిలీ ద్వారా కొత్త పర్యవేక్షణ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

భవిష్యత్తులో NEET, JEE వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. డిజిటల్‌ సెక్యూరిటీ, ప్రశ్నపత్రాల గోప్యత, పరీక్షా కేంద్రాల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education