Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Railway Jobs 2026: డిగ్రీ అర్హతతో రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. రూ.35,400 ప్రారంభ వేతనం!

Railway Jobs 2026: డిగ్రీ అర్హతతో రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. రూ.35,400 ప్రారంభ వేతనం!

SAKSHI EDUCATION 1 month ago

విస్తరణకు అనుగుణంగా కొత్త ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(ఆర్‌ఆర్‌బీ) వరుసగా నియామక నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా 119 సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ప్రకటించింది.

రైళ్ల రాకపోకలను సురక్షితంగా, సమర్థంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించేది సెక్షన్‌ కంట్రోలర్‌. ఈ నేపథ్యంలో..రైల్వేలో సెక్షన్‌ కంట్రోలర పోస్టుల ప్రత్యేకత, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..

ఆర్‌ఆర్‌బీ ఉద్యోగ నియామకాలకు గత కొన్నేళ్లుగా సెంట్రలైజ్డ్‌ నోటిఫికేషన్‌ ఇస్తోంది. అన్ని ఆర్‌ఆర్‌బీల్లోని ఖాళీలకు ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు మాత్రం తమకు ఆసక్తి, అర్హత ఉన్న ఆర్‌ఆర్‌బీకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తాజా గా 21 ఆర్‌ఆర్‌బీల పరిధిలోని రైల్వే జోన్లలో 119 సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్ట్‌లు ఉన్నాయి. ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌ పరిధి­లో దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 5పోస్టులు ఉన్నాయి.

సెక్షన్‌ కంట్రోలర్‌ భారతీయ రైల్వేలో అత్యంత కీలకమైన పోస్టుల్లో ఒకటి. నిర్దిష్ట రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలను సురక్షితంగా, సమయానికి, అంతరాయం లేకుండా నిర్వహించే బాధ్యత ఈ అధికారిదే. కంట్రోల్‌ ఆఫీస్‌లో కూర్చొని మొత్తం రైళ్ల కదలికను పర్యవేక్షిస్తూ.. వివిధ విభాగాల మధ్య సమన్వయం చేస్తారు. అందుకే సెక్షన్‌ కంట్రోలర్‌ను 'రైల్వే ఆపరేషన్స్ కు మెదడు' అని కూడా అంటారు.

ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 2026, జూలై1 నాటికి 20-33 ఏళ్లు ఉం డాలి. ఓబీసీ నాన్‌ క్రీమీలేయర్‌ వర్గాలకు మూడే­ళ్లు, ఎస్‌సీ/ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితలో సడలింపు లభిస్తుంది.

ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ కంట్రోలర్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే లెవల్‌-6తో వేతనం అందిస్తారు. ప్రారంభ వేతనం నెలకు రూ.35,400 లభిస్తుంది. దీనికి అదనంగా మెడికల్‌ అలవెన్స్, రైల్వే పాస్‌ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి.

ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ కంట్రోలర్‌ ఉద్యోగాల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ముందుగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

ఎంపిక ప్రక్రియలో తొలి దశ సీబీటీ 100 మా­ర్కులకు జరుగుతుంది. మూడు విభాగాల్లో ఈ పరీ­క్ష నిర్వహిస్తారు. అనలిటికల్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ కేపబిలిటీ (60 ప్రశ్నలు), లాజికల్‌ కేపబిలిటీ (20 ప్రశ్నలు), మెంటల్‌ రీజనింగ్‌ (20ప్రశ్నలు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు.

తొలి దశ సీబీఏటీలో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు ఎనిమిది మందిని చొప్పున ఎంపిక చేసి తదుపరి దశలో కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీబీఏటీ)ని నిర్వహిస్తారు. ఇందులో సైకోమాటిక్‌ టెస్ట్, రీజనింగ్‌ టెస్ట్, తులనాత్మక పరిశీలన వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు. అలాగే రియాక్షన్‌ టైమ్‌ టెస్ట్, ఫామ్‌ పర్సెప్షన్‌ టెస్ట్, స్పీడ్‌ పర్సెప్షన్‌ టెస్ట్, విజువల్‌ డిఫరెన్షియేటింగ్‌ టెస్ట్‌లు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు కనీసం 42 మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియలో చివరగా డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. తొలి దశ సీబీటీలో పొందిన మార్కులకు 70 శాతం వెయిటేజీ, రెండో దశ సీబీఏటీ మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి.. దాని ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు.

సెక్షన్‌ కంట్రోలర్‌గా ఎంపికైన వారు భవిష్యత్తులో డివిజనల్‌ కంట్రోలర్‌ ఆఫీసర్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అసిస్టెంట్‌ చీఫ్‌ కంట్రోలర్, డిప్యూటీ చీఫ్‌ కంట్రోలర్, డివిజనల్‌ కంట్రోలర్‌ ఆఫీసర్‌ హోదాలు లభిస్తాయి. ప్రతి హోదాలో కనీసం నాలుగేళ్లు పని చేసిన తర్వాత తదుపరి హోదాకు పదోన్నతికి అర్హత లభిస్తుంది.

AAI Recruitment 2026: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 389 ఉద్యోగాలు.. వార్షిక వేతనం రూ.21 లక్షలు.. పూర్తి వివరాలు!

మ్యాథమెటికల్‌ కేపబిలిటీ
ఈ విభాగంలో నంబర్‌ సిస్టమ్, బాడ్‌మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైం అండ్‌ వర్క్, టైం అండ్‌ డిస్టెన్స్, ఇంట్రస్ట్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్,ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, కేలండర్‌ అండ్‌ క్లాక్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతా­రు. వీటికోసం తొలుత స్కూల్‌ స్థాయి పాఠ్యపుస్తకా­ల్లో ఉన్న సిలబస్‌లోని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ, రైల్వే పరీక్షల పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయాలి.
లాజికల్‌ కేపబిలిటీ
బైనరీ లాజిక్, సిలాజిజమ్, క్లాక్స్‌ అండ్‌ క్యాలెండర్, అసెంప్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ఫ్యామిలీ ట్రీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి.
మెంటల్‌ రీజనింగ్‌
సిలబస్‌లో అనాలజీస్, ఆల్ఫాబెటికల్, నంబర్‌ సిరీస్, కోడింగ్‌-డీకోడింగ్, మ్యాథమెటికల్‌ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, జంబ్లింగ్, వెన్‌డయాగ్రమ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, డేటా సఫీషియెన్సీ, కన్‌క్లూజన్‌ అండ్‌ డెసిషన్‌ మేకింగ్, సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్, అనలిటికల్‌ రీజనింగ్, క్లాసిఫికేషన్, డెరైక్షన్స్‌ తదితర అంశాలపై దృష్టి సారించాలి.
సీబీఏటీ కోసం
మ్యాప్‌ బిల్డింగ్, పిక్చర్‌ నెంబర్‌ కాంబినేషన్, ట్రాక్‌ మెమొరీ, పిక్చర్‌ పెయిర్స్,ఫిగర్‌ పొజిషన్,లె టర్స్, కాలమ్స్,సర్క్యులర్‌ డైరెక్షన్స్,క్లాక్‌ టెస్ట్,నంబ ర్‌ బేస్‌ రో, పిక్చర్‌ ప్లేస్‌మెంట్స్‌పై దృష్టి సారించాలి.
బేసిక్స్‌పై పట్టు
అభ్యర్థులు ఆయా అంశాలకు సంబంధించిన బేసిక్స్‌పై పూర్తి అవగాహన పొందాలి. ఆ తర్వాత ఆబ్జెక్టివ్‌ ఓరియెంటేషన్‌తో ప్రాక్టీస్‌ పేపర్స్‌ సాధన చేయాలి. మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లకు హాజరైతే ఉపయుక్తంగా ఉంటుంది.
గత ప్రశ్న పత్రాల సాధన
ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు గత ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. ఫలితంగా ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ, ప్రశ్నలు అడుగుతున్న తీరు, ప్రశ్నల క్లిష్టత స్థాయి వంటి వాటిపై అవగాహన లభిస్తుంది.

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2026, ఆగస్ట్‌ 14
  • దరఖాస్తు సవరణ అవకాశం: 2026, ఆగస్ట్‌ 17 నుంచి 26 వరకు ∙పరీక్ష తేదీ: 2026, నవంబర్‌లో నిర్వహించే అవకాశం
  • వెబ్‌సైట్‌: https://rrbsecunderabad.gov.in


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education