సాక్షి ఎడ్యుకేషన్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ పరిధిలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రేపు(16.05.2026) జాబ్‌మేళా జరగనుంది. ఈజాబ్‌మేళాలో హాస్పిటల్స్, సాఫ్ట్‌వేర్, ఫార్మా, ఆటోమొబైల్, ప్రొడక్షన్ రంగాలకు చెందిన 10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.
మొత్తం 1,125 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ డ్రైవ్ ఉపయోగపడుతుంది. విద్యార్హతల విషయానికి వస్తే 10వ తరగతి (SSC) ఫెయిల్/పాస్ అయిన వారి నుంచి మొదలుకొని ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, ఎంబీఏ చదివిన అభ్యర్థుల వరకు అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్ కార్డ్‌తో హాజరు కావాలి. మరిన్ని వివరాల కోసం 9533221189 అనే ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.
| క్రమ సంఖ్య | సంస్థ పేరు | ఉద్యోగం పేరు | ఖాళీలు | అర్హత | వయస్సు పరిమితి | జీతం |
|---|---|---|---|---|---|---|
| 1 | ఆకాశం హాస్పిటల్స్ (Akasam Hospitals) | నర్సింగ్ / డేటా ఎంట్రీ / అకౌంట్స్ / రిసెప్షనిస్ట్ (Nursing/ Data entry/ Accounts/ Receptionist) | 20 | ANM/GNM/ఏదైనా డిగ్రీ | 19-28 | కంపెనీ నిబంధనల ప్రకారం |
| 2 | అవంతి ఫ్రోజెన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Avanti Frozen Foods Pvt Ltd) | Online QC/ Production Trainee Supervisor /HR Trainee | 30 | B.Sc Fisheries, Chemistry, MBA | 20-32 | రూ.13,500 - రూ.18,000 |
| 3 | కియా మోటార్స్ (Kia Motors) | ప్రొడక్షన్ & అసెంబ్లీ అసోసియేట్ (Production & Assembly Associate) | 100 | డిప్లొమా | 18-26 | రూ.19,500 |
| 4 | కిమ్స్ హాస్పిటల్స్ (KIMS Hospitals) | జూనియర్ డాక్టర్స్ / నర్సింగ్ / హౌస్ కీపింగ్ (Jr. Doctors/ Nursing/Housekeeping) | 30 | MBBS / B.Sc Nursing / GNM | 19-30 | కంపెనీ నిబంధనల ప్రకారం |
| 5 | లార్సెన్ & టుబ్రో (Larsen & Toubro) | సర్వేయర్ / ఫిట్టర్ / వెల్డర్ / ఎలక్ట్రిషియన్ / ప్లంబర్ (Surveyor/Mansion/ Fitter/ Welder/ Electrician/ Plumber) | 100 | ITI, SSC, ఇంటర్ | 19-35 | రూ.18,000 - రూ.20,000 |
| 6 | మెడ్‌ప్లస్ (Medplus) | Pharmacist/ Pharmacy Aide/ CSA/ Warehouse Assistant/ Electrician/ AC Technician | 240 | ఫార్మసీ / SSC నుండి డిగ్రీ | 18-35 | రూ.18,000 - రూ.22,000 |
| 7 | రావళి స్పిన్నర్స్ (Ravali Spinners) | Electricians/ Fitters/ Spinning Operator /Autoconer Operator /Preparatory Operator | 500 | ITI / SSC / ఇంటర్ | 20-25 | రూ.12,000 - రూ.16,000 |
| 8 | స్పైహ్రే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Spyhre Software Solutions Pvt Ltd) | SQL ఉద్యోగాలు | 5 | ఏదైనా డిగ్రీ, SQL అనుభవం | 19-35 | రూ.20,000 - రూ.40,000 |
| 9 | ఠాగూర్ లాబొరేటరీస్ (Tagoor Laboratories) | ప్రొడక్షన్(Production) | 100 | SSC / ఇంటర్ / B.Sc | 19-27 | కంపెనీ నిబంధనల ప్రకారం |
| 10 | టీమ్ లీజ్ (Team Lease) | FRE / BRE / BDM | 100 | ఇంటర్ మరియు పైగా | 18-35 | రూ.14,000 - రూ.18,000 |
- తేదీ: మే 16, 2026
- వేదిక: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, రాజమండ్రి అర్బన్, తూర్పు గోదావరి జిల్లా
- సంప్రదించండి: 9533221189

