Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు జిల్లా ఉపాధి కార్యాలయం ప్రాంగణంలో ఉద్యోగ మేళా

రేపు జిల్లా ఉపాధి కార్యాలయం ప్రాంగణంలో ఉద్యోగ మేళా

SAKSHI EDUCATION 2 days ago

సాక్షి ఎడ్యుకేషన్: కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయం (District Employment Exchange) ప్రాంగణంలో మే 23వ తేదీ(రేపు) ఉద్యోగ మేళా జరగనుంది. ఈ జాబ్‌మేళాలో బ్లూ ఓషన్ పర్సనల్ అలైడ్ సర్వీసెస్, ఇన్నోవ్‌సోర్స్ సర్వీసెస్ అనే రెండు ప్రముఖ సంస్థలు పాల్గొని, మొత్తం 200 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నాయి.

పదో తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతభత్యాలు అందించబడతాయి.

క్రమ సంఖ్యసంస్థ పేరుఉద్యోగ హోదాఖాళీలుఅర్హతవయస్సు పరిమితిజీతం
1బ్లూ ఓషన్ పర్సనల్ అలైడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
(Blue Ocean Personnel Allied Services Pvt Ltd)
ఆపరేటర్లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, ప్రొడక్షన్ హెల్పర్లు
(Operators, Production Assistants, Production Helpers)
140SSC / ఏదైనా ITI / డిప్లొమా / డిగ్రీ / పీజీ18-30 సంవత్సరాలురూ.14,000 - రూ.20,000
2ఇన్నోవ్‌సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
(INNOVSOURCE SERVICES PVT LTD)
సీనియర్ టీమ్ లీడర్స్, సేల్స్ అసిస్టెంట్స్, టీమ్ లీడర్స్
(Sr Team Leaders, Sales Assistants, Team Leaders)
60ఇంటర్ / ఏదైనా డిగ్రీ21-35 సంవత్సరాలురూ.19,500 - రూ.25,000
  • తేదీ: 23-05-2026
  • స్థలం: జిల్లా ఉపాధి కార్యాలయం, కాకినాడ
  • పాల్గొనే సంస్థలు: 2
  • మొత్తం ఖాళీలు: 200
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education