సాక్షి ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఉపాధి మార్గదర్శక కార్యాలయం(Sub Employment Exchange Office)లో రేపు(మే 19) భారీ జాబ్‌మేళా నిర్వహించబడుతోంది.
ఈ జాబ్‌మేళాలో ప్రముఖ సంస్థలైన అపోలో ఫార్మసీ, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, ఫోన్ పే పాల్గొంటున్నాయి. మొత్తం 770 ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ, ఏదైనా డిగ్రీ/పీజీ అర్హత కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11,500 నుండి రూ.18,000 వరకు జీతం లభిస్తుంది.
| క్రమ సంఖ్య | సంస్థ పేరు | ఉద్యోగ హోదా | ఖాళీలు | అర్హత | వయస్సు పరిమితి | జీతం |
|---|---|---|---|---|---|---|
| 1 | అపోలో ఫార్మసీ (APOLLO PHARMACY) | ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ అసోసియేట్ (PHARMACIST, PHARMACY ASSISTANT, RETAIL TRAINEE ASSOCIATE) | 170 | ఎస్‌ఎస్‌సి / డి-ఫార్మసీ / బి-ఫార్మసీ / ఏదైనా డిగ్రీ | 18-35 సంవత్సరాలు | రూ.11,500 - 18,000/- |
| 2 | క్రెడిట్ యాక్సెస్ గ్రామీన్ లిమిటెడ్ (CREDIT ACCESS GRAMEEN LTD) | కేంద్ర మేనేజర్ (KENDRA MANAGER) | 300 | ఐటీఐ / ఇంటర్ / ఏదైనా డిగ్రీ / ఏదైనా పీజీ | 18-35 సంవత్సరాలు | రూ.12,000 - 16,300/- |
| 3 | ఫోన్‌పే (PHONE PE) | బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ సేల్స్ అసోసియేట్ (BUSINESS DEVELOPMENT EXECUTIVE, FIELD SALES ASSOCIATE) | 300 | ఇంటర్ / ఏదైనా డిగ్రీ / ఏదైనా పీజీ | 20-35 సంవత్సరాలు | రూ.14,000 - 17,000/- |
- తేదీ: 19-05-2026
- స్థలం: Sub Employment Exchange Office, అమలాపురం, కోనసీమ జిల్లా
- పాల్గొనే కంపెనీలు: 3
- మొత్తం ఉద్యోగ ఖాళీలు: 770

