అధికారిక షెడ్యూల్ ప్రకారం RRB Group D CBT పరీక్షలు 2026 ఆగస్టు 3 నుంచి ఆగస్టు 21 వరకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో పలు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.
CEN 09/2025 నోటిఫికేషన్ ద్వారా భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో మొత్తం 22,195 గ్రూప్-డి (Level-1) పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదో తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన లక్షలాది మంది అభ్యర్థులు ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
- పరీక్ష ప్రారంభం: 3 ఆగస్టు 2026
- పరీక్ష ముగింపు: 21 ఆగస్టు 2026
- పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
- పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా వివిధ నగరాలు
- షిఫ్టులు: రోజుకు పలు షిఫ్టులు
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు క్రింది వివరాలను దశలవారీగా విడుదల చేయనున్నారు.
- Exam City Intimation Slip
- SC/ST ఉచిత ప్రయాణ పాస్
- Admit Card / e-Call Letter
సాధారణంగా పరీక్షకు 10 రోజుల ముందు ఎగ్జామ్ సిటీ వివరాలు, 4 రోజుల ముందు హాల్ టికెట్లు విడుదల చేసే అవకాశం ఉంది.
గ్రూప్-డి పోస్టుల భర్తీకి ఎంపిక ఈ దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. త్వరలో భారీ నోటిఫికేషన్!
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

