Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
RTI పరిధిలోకి బీసీసీఐ రాదు.. కేంద్ర సమాచార కమిషన్ సంచలన తీర్పు..!

RTI పరిధిలోకి బీసీసీఐ రాదు.. కేంద్ర సమాచార కమిషన్ సంచలన తీర్పు..!

SAKSHI EDUCATION 1 week ago

  • సమాచార కమిషనర్ పి.ఆర్. రమేష్ తాజాగా వెలువరించిన ఈ తీర్పు ద్వారా 2018 నుంచి కొనసాగుతున్న న్యాయపరమైన వివాదానికి ముగింపు పలికారు.
  • ప్రభుత్వ నియంత్రణ లేదు: బీసీసీఐ అనేది 'తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం' కింద నమోదైన ఒక స్వయంప్రతిపత్తి గల ప్రైవేట్ సంస్థ.

  • దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష నియంత్రణ లేదని CIC పేర్కొంది.
  • ఆర్థిక స్వేచ్ఛ: బీసీసీఐ ప్రభుత్వ నిధులపై ఏమాత్రం ఆధారపడటం లేదు. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ల విక్రయాల ద్వారా సొంతంగా నిధులను సమకూర్చుకుంటూ ఆర్థికంగా స్వతంత్ర సంస్థగా కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి గణనీయమైన ఆర్థిక సహాయం అందుకోనందున దీనిని పబ్లిక్ అథారిటీగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
  • రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు: బీసీసీఐ భారత రాజ్యాంగం ద్వారా గానీ, పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల చట్టం ద్వారా గానీ లేదా ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా గానీ ఏర్పడలేదు. అందువల్ల ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్ 2(h) ప్రకారం ఇది 'పబ్లిక్ అథారిటీ' నిర్వచనం కిందకు రాదు.
  • అప్పీల్ కొట్టివేత: అసలు బీసీసీఐ ఏ అధికారంతో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది? జాతీయ, అంతర్జాతీయ టోర్నీలకు ఆటగాళ్లను ఎలా ఎంపిక చేస్తుందనే వివరాలను కోరుతూ దాఖలైన అప్పీల్‌ను కమిషన్ తాజా విచారణలో కొట్టివేసింది.
  • 2018లో అప్పటి ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎం. శ్రీధర్ ఆచార్యులు.. బీసీసీఐని 'పబ్లిక్ అథారిటీ'గా గుర్తిస్తూ, ఆర్‌టీఐ పరిధిలోకి తీసుకువచ్చారు. దీనిని సవాలు చేస్తూ బీసీసీఐ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తీర్పుల వెలుగులో ఈ విషయాన్ని తాజాగా విచారించాల్సిందిగా హైకోర్టు మళ్లీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌కు సిఫారసు చేసింది.
  • దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన CIC, బీసీసీఐ ఆర్‌టీఐ పరిధిలోకి రాదని తాజాగా (మే 18, 2026) తీర్పు వెలువరించింది.

Follow our YouTube Channel (Click Here) .


Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education