సాక్షి ఎడ్యుకేషన్: ప్రొఫెషనల్ ఎడిటర్లు, అనువాదకులు (translators), గ్రాఫిక్ డిజైనర్లు, రైటర్ల కోసం అంతర్జాతీయ ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా గుర్తింపు పొందిన 'సర్వీస్‌స్కేప్' (ServiceScape) సంస్థ ఈ 'సర్వీస్‌స్కేప్ స్కాలర్‌షిప్ 2026'ను అందిస్తోంది.
ప్రతిభావంతులైన విద్యార్థులు తమ విద్యాసంబంధిత ఖర్చులను భరించుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం అందించబడుతుంది. అర్హత గల అభ్యర్థులకు ఒకేసారి $1,000 డాలర్ల(రూ.95,000 పైన) నగదు బహుమతి లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 నవంబర్ 2026.
- అభ్యర్థి కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి
- గుర్తింపు పొందిన కళాశాల, విశ్వవిద్యాలయం లేదా ట్రేడ్ స్కూల్‌లో ప్రవేశం పొందిన లేదా చదువుతున్న విద్యార్థి అయి ఉండాలి
- ఏ కోర్సు లేదా విద్యా విభాగంలో చదువుతున్న వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు
- ServiceScape ఇచ్చే అంశంపై 300 నుండి 600 పదాల వ్యాసం సమర్పించాలి
- ఎంపికైన విద్యార్థికి $1,000(రూ.95,000 పైన)స్కాలర్‌షిప్ నగదు బహుమతి అందజేయబడుతుంది
- దరఖాస్తు చివరి తేదీ: 30-11-2026
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా మాత్రమే
- దరఖాస్తు లింక్:www.b4s.in/sen/SSSZ2
- QR కోడ్ లింక్:

