మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం 2026 కింద విదేశీ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 1, 2026 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు కొనసాగనుంది. ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారు.
బీసీ సంక్షేమ శాఖ సూచనల ప్రకారం.. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG), పీహెచ్‌డీ (PhD) వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించాలనుకునే అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.
ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కింది అర్హతలను కలిగి ఉండాలి.
- అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ.5 లక్షల లోపు ఉండాలి.
- దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
- గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
విదేశీ విద్య కోసం అవసరమైన పరీక్షల్లో కింది వాటిలో ఏదైనా స్కోర్ ఉండాలి.
- GRE: 260 లేదా అంతకంటే ఎక్కువ
- GMAT: 500 లేదా అంతకంటే ఎక్కువ
- TOEFL: 60 మార్కులు
- IELTS: 6.0 బ్యాండ్
- PTE: 50 మార్కులు
మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కొనసాగించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. విదేశీ యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడనుంది.
- దరఖాస్తుల ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 1, 2026
- దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2026
అర్హత కలిగిన బీసీ, ఈబీసీ విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
దరఖాస్తు విధానం, పూర్తి వివరాల కోసం తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
వెబ్‌సైట్: https://telanganaepass.cgg.gov.in
>> 8th Class విద్యార్థులకు గుడ్ న్యూస్.. NMMS Scholarshipతో నాలుగేళ్లు రూ.48,000 ఆర్థిక సాయం!
![]() ![]() | ![]() ![]() | ![]() |






