Dailyhunt
SECR 1644 Apprentices : రైల్వేలో అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. 10వ, ఐటీఐతోనే అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే..

SECR 1644 Apprentices : రైల్వేలో అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల.. 10వ, ఐటీఐతోనే అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే..

SAKSHI EDUCATION 3 days ago

నిరుద్యోగులకు, మరీ ముఖ్యంగా రైల్వే ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. 2026-27 సంవత్సరానికి సంబంధించి రాయ్‌పూర్ డివిజన్‌ లో ఉన్న అప్రెంటీస్ ఖాళీల ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇందులో మొత్తం 1644 ఖాళీలు ఉండగా, అర్హులైన నిరుద్యోగుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను కోరుతున్నారు. కింద వివరలను చదివి, ఆపై దరఖాస్తులను వచ్చేనెల., జూన్ 4వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో మొత్తం యాక్ట్‌ అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 1,644
అందులో, డీఆర్‌ఎం ఆఫీసర్‌, రాయ్‌పుర్‌ డివిజన్ ఖాళీల సంఖ్య: 1363
వేగన్‌ రిపేర్‌షాప్‌, రాయ్‌పుర్‌లో ఉన్న ఖాళీల సంఖ్య: 281

ఫిట్టర్
కార్పెంటర్
వెల్డర్
పీఓపీఏ
ఎలక్ట్రీషియన్
స్టెనోగ్రాఫర్
పెయింటర్
ఎలక్ట్రానిక్స్ మెకానిక్
సీఓసీఏ
మెషినిస్ట్
టర్నర్ తదితరాలు.

పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ పూర్తి చేసి, కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
మే 5, 2026 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలి.

అర్హత ఆసక్తి గల అభ్యర్థులు వారి దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుల ప్రక్రియను జూన్ 4 వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది.

మెట్రిక్యులేషన్
ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.

అధికారిక వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in/

మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు అధికారిక నోటిఫికేషన్‌ను సందర్శించండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education