Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్పెయిన్‌-మొరాకో సరిహద్దులో వలసల సంక్షోభం: 'సియుటా'లోకి వేలాదిగా చొరబాటు..!

స్పెయిన్‌-మొరాకో సరిహద్దులో వలసల సంక్షోభం: 'సియుటా'లోకి వేలాదిగా చొరబాటు..!

SAKSHI EDUCATION 3 weeks ago

రాజల్ బీచ్ మీదుగా చొరబాటు: మొరాకోలోని టరాజల్ బీచ్ (Tarajal Beach) ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో యువకులు, మహిళలు, చిన్నారులు సముద్రపు బ్రేక్ వాటర్లను దాటి సియుటాలోకి ప్రవేశించారు.

స్పెయిన్ భూభాగంలోకి చేరుకోగానే కొందరు వలసదారులు "వివా ఎస్పానా" (స్పెయిన్‌కు జయహో) అంటూ నినాదాలు చేశారు.
నిండిపోయిన ఆశ్రయ కేంద్రాలు: ఎంతమంది సరిహద్దు దాటారో కచ్చితంగా చెప్పలేమని, వేలాదిగా వలసదారులు రావడంతో పరిస్థితి గందరగోళంగా మారిందని సియుటా సివిల్ గార్డ్ అధికారులు వెల్లడించారు. అక్కడి శరణార్థుల కేంద్రాలు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి.
అత్యవసర పరిస్థితికి డిమాండ్: పరిస్థితులు అదుపు తప్పడంతో, సియుటా ప్రాంతీయ ప్రభుత్వ అధిపతి జువాన్ జీసస్ వివాస్ (Juan Jesús Vivas) స్పందించారు. పౌరుల భద్రత కోసం 'జాతీయ అత్యవసర పరిస్థితి' (National Emergency) ప్రకటించాలని, సరిహద్దు వద్ద అదనపు పోలీసు బలగాలతో పాటు సైన్యాన్ని మోహరించాలని స్పెయిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ స్పందన: వలసల ప్రవాహాన్ని అత్యవసర పరిస్థితిగా పరిగణించలేమని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, పరిస్థితిని చక్కదిద్దేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

వలసదారుల అక్రమ ప్రవేశాలను అడ్డుకునేందుకు స్పెయిన్ ప్రభుత్వం మొరాకో అధికారులతో కలిసి పనిచేస్తోంది. అక్రమంగా ప్రవేశించిన వారిని వీలైనంత త్వరగా వెనక్కి పంపించేందుకు (Deportation) ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి.

తాజా పరిణామాలు 2021 మే నెలలో జరిగిన భారీ వలస సంక్షోభాన్ని గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో దౌత్యపరమైన ఉద్రిక్తతల (స్పెయిన్‌లో చికిత్స పొందిన వెస్ట్రన్ సహారా వేర్పాటువాద నేత బ్రాహిం ఘాలీ వ్యవహారం) కారణంగా మొరాకో ఉద్దేశపూర్వకంగా సరిహద్దు నియంత్రణలను సడలించడంతో.. కేవలం రెండు రోజుల్లోనే 8 వేల మందికి పైగా వలసదారులు సియుటాలోకి ప్రవేశించారు.

సియుటా (Ceuta) & మెలిల్లా (Melilla): ఇవి ఆఫ్రికా ఖండంలో (ఉత్తర ఆఫ్రికా తీరంలో) ఉన్న స్పెయిన్ స్వయంప్రతిపత్తి గల భూభాగాలు. ఆఫ్రికా ఖండంతో ఐరోపా సమాఖ్యకు (EU) ఉన్న ఏకైక భూ సరిహద్దులు ఇవే.
ప్రధాన వలస మార్గం: మొరాకోలోని ఫ్నిడెక్ పట్టణం నుంచి సుమారు 5 కిలోమీటర్ల సముద్ర మార్గాన్ని ఈదుకుంటూ ఈ ప్రాంతం గుండా ఐరోపాలోకి ప్రవేశించేందుకు వలసదారులు తరచూ యత్నిస్తుంటారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education