Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SSC JE Recruitments 2026 : 1,748 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిప్లొమా/బీఎస్సీ/బీఈ/బీటెక్‌తో అప్లై చేసుకోండి.. వివరాలివే!!

SSC JE Recruitments 2026 : 1,748 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిప్లొమా/బీఎస్సీ/బీఈ/బీటెక్‌తో అప్లై చేసుకోండి.. వివరాలివే!!

SAKSHI EDUCATION 1 week ago

జూనియర్ ఇంజినీర్‌

1,748 (తాత్కాలిక ఖాళీలు)

సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/టెలికాం తదితర విభాగాలు

విద్య- గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి డిప్లొమా/బీఎస్సీ/బీఈ/బీటెక్(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, టెలికాం, సీఎస్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్)లో ఉత్తీర్ణత ఉండాలి.

అలాగే, విభాగాన్ని బట్టి ఉద్యోగానుభవం ఉండాలి.
వయసు- ఆగస్టు 1, 2026 నాటికి పోస్ట్/డిపార్ట్‌మెంట్‌ను బట్టి 30 నుంచి 32 ఏళ్లు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీ 5 ఏళ్లు, ఓబీసీ 3 ఏళ్లు, పీడబ్లూబీడీ 10 నుంచి 15 ఏళ్లు సడలింపు ఉంటుంది.

ఆసక్తిగల అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి.
ఫీజు- రూ.100. చెల్లించాలి (మహిళలు, ఎస్సీ,ఎస్టీ, పీడబ్లూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ప్రారంభం తేదీ- సెప్టెంబర్ 2, 2026
చివరి తేదీ- సెప్టెంబర్ 22, 2026
ఫీజుకు చివరి తేదీ- సెప్టెంబర్ 23, 2026
దరఖాస్తుల సవరణ- సెప్టెంబరు 28 నుంచి 30, 2026
పరీక్ష తేదీలు (అంచనా)- పేపర్-I అక్టోబర్/నవంబర్ 2026 లో; పేపర్-II డిసెంబర్ 2026 లో ఉంటుంది.

కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (పేపర్-I, పేపర్-II)
డాక్యుమెంట్ వెరిఫికేషన్

నెలకు రూ.35,400 - రూ.1,12,400.

పేపర్-I (CBT) - మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి.
సమయం 2 గంటలు.
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ (50 మార్కులు)
జనరల్ అవేర్‌నెస్ (50 మార్కులు)
అభ్యర్థి ఎంచుకున్న ఇంజినీరింగ్ సబ్జెక్టు (100 మార్కులు) నుంచి ప్రశ్నలు ఉంటాయి.
ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

పేపర్-II (CBT) - సివిల్, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్‌లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 300
సమయం 2 గంటలు.
ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education