- భారత విద్యార్థులు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వైపు ఆసక్తి చూపడం లేదనడానికి గత ఏడాది కాలంలో నమోదైన గణాంకాలనే నిదర్శనంగా చెప్పొచ్చు.
- అమెరికాకు గత ఏడాది ఎఫ్-1 వీసాల సంఖ్య 44 శాతం తగ్గింది.
- కెనడాలో స్టూడెంట్ వీసాల సంఖ్య 41 శాతం తగ్గింది.
- యూకేలో ఈ ఏడాది ఏప్రిల్ నాటికి వీసా దరఖాస్తుల సంఖ్య 40 శాతం తగ్గింది.
- ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులకు వీసాల మంజూరు 49 శాతానికి పడిపోయింది.
ఈ నాలుగు దేశాల్లో మన విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కొత్తగా అక్కడ అమలు చేస్తున్న నిబంధనలే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అమెరికాలో వీసా దరఖాస్తు కోసమే దాదాపు రూ.40 వేలు చెల్లించాల్సి వస్తోంది. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ విధానాన్ని తొలగించడం, ఫీజులు పెరగడంతో కెనడాకు భారత విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ దేశం వీసా ఫీజును రెండు వేల డాలర్లకు పెంచింది. కనీసం 19,710 డాలర్లను ఆర్థిక నిధులుగా చూపాలనే నిబంధనను అమలు చేస్తోంది. యూకేలో కూడా వీసా దరఖాస్తు ఫీజును 558 పౌండ్లకు పెంచారు. దీంతోపాటు ప్రతి నెల నివాస ఖర్చుల కోసం 1,334 పౌండ్ల చొప్పున నిధులు ఉన్నాయని నిరూపించాల్సిన పరిస్థితి నెలకొంది.
యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాల్లో కఠిన నిబంధనలు, భారీ ఫీజుల నేపథ్యంలో మన విద్యార్థులు జపాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వైపు చూస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం-జర్మనీలో గత మూడేళ్లలో భారత విద్యార్థుల సంఖ్య 59 శాతం, ఐర్లాండ్‌లో 49 శాతం, ఫ్రాన్స్‌లో 33 శాతం చొప్పున పెరిగారు. అదే విధంగా జపాన్‌లో సైతం 22 శాతం మేరకు భారత విద్యార్థుల సంఖ్యలో వృద్ధి నమోదైంది.
భారతీయ విద్యార్థులు విదేశాల్లో స్టెమ్, డేటా సై న్స్ అండ్ ఏఐ, హెల్త్‌కేర్ అండ్ మెడిసిన్, ఫైనాన్స్ అండ్ ఫిన్‌టెక్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
విద్యార్థులు ముందుగా తమకు ఆసక్తి ఉన్న దేశంలోని యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలి. యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకునే సమయంలోనే టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ, జీమ్యాట్ వంటి ప్రామాణిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశం ఖరారయ్యాక అడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్‌తో వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు విద్యార్థుల అర్హతలు, ప్రవేశం పొందిన కోర్సు, ఇన్‌స్టిట్యూట్‌లను పరిగణనలోకి తీసుకుని.. ఇమిగ్రేషన్ అధికారులు వీసా మంజూరు చేస్తారు. వీసా దరఖాస్తు సమయంలో అడ్మిషన్ లెటర్‌తో పాటు బ్యాంక్ స్టేట్‌మెంట్, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, ఫీజు చెల్లించిన రశీదులు అందించాల్సి
ఉంటుంది.
స్టడీ అబ్రాడ్ విద్యార్థులు.. కనీసం ఆరు నెలల ముందుగానే అడ్మిషన్ ఖరారు చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడే స్టాండర్డ్ టెస్ట్‌లకు హాజరై ఉత్తీర్ణత సాధించాలి. కనీసం ఏడాది ముందుగానే తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, వాటిని అందిస్తున్న ఉత్తమ యూనివర్సిటీల ఎంపిక వంటి వాటిపై కసరత్తును ప్రారంభించాలి.
అమెరికా చదువు కలలకు ఆర్థిక భారాల మేఘాలు.. డాలర్ దూకుడు, వీసా కఠినతతో తెలుగు విద్యార్థుల ఆందోళన!
జర్మనీ
- ఇటీవల కాలంలో మన విద్యార్థులకు బెస్ట్ డెస్టినే షన్‌గా నిలుస్తున్న దేశం జర్మనీ. ఇక్కడ చదువు కుంటూనే వారానికి 20 గంటలు పని చేసుకో వచ్చు. అదే విధంగా.. జర్మనీలో పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలు పుష్కలం. పీజీ స్థాయి కోర్సు లు పూర్తి చేసుకున్న విద్యార్థులు 18 నెలల పా టు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం లభిస్తే సదరు ఎంప్లా యర్ ద్వారా వర్క్ పర్మిట్ పొందొచ్చు. ఈయూ బ్లూకార్డ్ విధానం మేరకు.. గుర్తింపు పొందిన సంస్థలో ఉద్యోగం లభించి వర్క్ పర్మిట్ పొందితే పర్మనెంట్ రెసిడెన్సీ పొందడం సులభం అవుతుంది.
- జర్మనీ యూనివర్సిటీల్లో చేరిన వారికి ఆర్థికంగా వెసులుబాటు లభిస్తోంది. ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీల్లో ఉచిత విద్యకు అవకాశం ఉంది. ఈ దేశంలో దాదాపు మూడు వందల పబ్లిక్ యూనివర్సిటీలు ఉన్నాయి. దీంతో జర్మనీకి వెళ్లే విద్యార్థులు ట్యూషన్ ఫీజుల భారం నుంచి ఉపశమనం పొందే వీలుంది. ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రం మాస్టర్ కోర్సులకు ఏడాదికి 15 వేల యూరోల నుంచి 30 వేల యూరోల వరకు ట్యూషన్ ఫీజును వసూలు చేస్తున్నాయి. అకడమిక్‌గా మంచి ట్రాక్ రికార్డ్.. స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్ బాగుంటే పబ్లిక్ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందడం సులభం.. తద్వారా ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందొచ్చు.
ఫ్రాన్స్
మన విద్యార్థులకు మరో బెస్ట్ ఆల్టర్నేటివ్‌గా నిలుస్తోంది.. ఫ్రాన్స్. ఎకోల్ నార్మల్ సుపీరియర్, ఎకోల్ పాలిటెక్నిక్, యూనివర్సిటీ పియెర్రె ఎట్ మేరీ క్యూరీ, సెంట్రల్ సుపీలెక్, ఎకోల్ నార్మల్ సుపీరియర్ డె లియన్, యూనివర్సిటీ గ్రెనోబల్, ప్యారిస్ యూనివర్సిటీ, యూనివర్సిటీ డి స్ట్రాస్‌బర్గ్, ప్యారిస్ యూనివర్సిటీ డిడెరట్, యూనివర్సిటీ డి మాంట్‌పెల్లెర్ వంటి పలు ప్రముఖ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇక్కడ ఫీజులు కూడా నామమాత్రంగానే ఉంటాయని చెప్పొచ్చు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో వార్షిక ఫీజు ఇంజనీరింగ్ కోర్సుకు 620 యూరోలుగా, మేనేజ్‌మెంట్ కోర్సులకు 4,500 యూరోల నుంచి ఏడు వేల యూరోల వరకు చెల్లించాల్సి ఉంటుంది. హ్యుమానిటీస్, ఆర్ట్స్ తదితర ట్రెడిషనల్ కోర్సులకు సగటున ఏడాదికి 270 యూరోలుగా ఉంటోంది. ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్‌లో మాత్రం ఈ ఫీజులు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఇక్కడ కూడా వారానికి 20 గంటలకు మించకుండా పార్ట్ టైమ్ జాబ్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా.. పోస్ట్ స్టడీ వర్క్ నిబంధనల మేరకు అయిదేళ్ల పాటు.. అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. ఫ్రాన్స్‌లోని పలు రంగాలకు చెందిన సంస్థలు ఆకర్షణీయ వేతనాలను అందిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం-సగటు వేతనం నెలకు రూ.3,085 యూరోలుగా ఉంది. కనీస వేతనం రూ.1,708 యూరోలు ఉండాలనే నిబంధనను ఫ్రాన్స్ ప్రభుత్వం అమలు చేస్తోంది.
జపాన్
రెండు వందలకుపైగా యూనివర్సిటీలున్న జపాన్ కూడా మన విద్యార్థులకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ స్టడీస్, హెల్త్‌కేర్ అండ్ మెడిసిన్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులకు అధిక ప్రాధాన్యం లభిస్తోంది. అదే విధంగా కోర్సు పూర్తయ్యాక.. పోస్ట్ స్టడీ వర్క్ కోసం అక్కడే ఆరు నెలలపాటు ఉండేలా డిజిగ్నేటెడ్ యాక్టివిటీస్ వీసా పేరుతో తాత్కాలిక వీసా కూడా అందిస్తారు. జపాన్‌లోని యూనివర్సి టీల్లో చేరాలంటే మాత్రం జపనీస్ లాంగ్వేజ్‌లో బేసిక్ నైపుణ్యాలను పరిశీలించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పబ్లిక్ యూనివర్సిటీల్లో ఏడాదికి రూ.3 లక్షల నుంచి నాలుగు లక్షలు; ప్రైవేట్ వర్సిటీల్లో ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
న్యూజిలాండ్
విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు అక్కడి ప్రభుత్వం న్యూజిలాండ్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ పేరుతో ఇమిగ్రేషన్ నిబంధనల్లో పలు వెసులుబాట్లు కల్పిస్తోంది. ఇక్కడ ఎంఎస్, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌తోపాటు కామర్స్, హ్యుమానిటీస్, మెడిసిన్, ఐటీ, ప్యూర్ సైన్సెస్ వంటి విభాగాల్లోనూ అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫీజులు తక్కువగా ఉండడం కలిసొచ్చే అంశం. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజు 18 వేల నుంచి 25 వేల న్యూజిలాండ్ డాలర్లుగా; పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజు 10 వేల న్యూజిలాండ్ డాలర్ల నుంచి 25 వేల న్యూజిలాండ్ డాలర్ల మధ్యలో ఉంటుంది. ఎంబీఏ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, టూరిజం స్పెషలైజేషన్లకు డిమాండ్ నెలకొంటోంది. పోస్ట్ స్టడీ వర్క్ అవకాశం కూడా ఉంది. రెండేళ్ల వ్యవధిలోని కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆ తర్వాత మరో ఏడాదిపాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ కొనసాగించొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే.. ఎంప్లాయర్ స్పాన్సర్‌షిప్ లెటర్ ఆధారంగా వర్క్ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రారంభంలో ఈ వర్క్ పర్మిట్‌ను రెండేళ్ల వ్యవధికి మంజూరు చేస్తారు. ఆ తర్వాత స్పాన్సరర్ సిఫార్సు మేరకు పొడిగించుకునే అవకాశం ఉంది.
ఐర్లాండ్
ఐర్లాండ్‌లో ఎడ్యుకేషన్ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ వరకు బ్యాచిలర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పీజీ కోర్సు వ్యవధి ఏడాది నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. ఫీజులు గరిష్టంగా 20 నుంచి 23 వేల యూరోల మధ్యలో ఉంటున్నాయి. థర్డ్ లెవల్ గ్రాడ్యుయేట్ స్కీమ్ పేరుతో పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తోంది.
- ప్రపంచ స్థాయి విద్య
- మెరుగైన ఉద్యోగ అవకాశాలు
- అధిక వేతనాలు
- అంతర్జాతీయ అనుభవం
- గ్లోబల్ కెరీర్‌కు బలమైన పునాది
- అమెరికా, ఆస్ట్రేలియా, యూకేల్లో నిబంధనలు కఠినతరం
- ఆర్థిక నిధుల ప్రమాణాలు పెరగడం
- ఇమ్మిగ్రేషన్, పార్ట్‌టైమ్, పోస్ట్‌స్టడీ వర్క్ వీసాలపై పరిమితులు
- అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు
- విద్యార్థుల్లో ఆందోళన, అనిశ్చితి
- జర్మనీ
- ఐర్లాండ్
- ఫ్రాన్స్
- సింగపూర్
- న్యూజిలాండ్
అమెరికా
- ఫాల్ (ఆగస్టు-సెప్టెంబర్) - ప్రధాన ఇంటేక్
- స్ప్రింగ్ (జనవరి)
- సమ్మర్ (మే/జూన్ - పరిమిత కోర్సులు)
యూకే
- సెప్టెంబర్/అక్టోబర్ - ప్రధాన ఇంటేక్
- జనవరి
- మే - పరిమిత కోర్సులు
ఆస్ట్రేలియా
- ఫిబ్రవరి (సెమిస్టర్-1) - ప్రధాన ఇంటేక్
- జూలై (సెమిస్టర్-2)
- నవంబర్ - పరిమిత కోర్సులు
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సైన్స్
- కంప్యూటర్ సైన్స్
- సైబర్ సెక్యూరిటీ
- బిజినెస్ అనలిటిక్స్
- ఇంజినీరింగ్
- రెన్యూవబుల్ ఎనర్జీ
- ఫిన్ టెక్
- హెల్త్‌కేర్ - పబ్లిక్ హెల్త్
- బయోటెక్నాలజీ
- మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లు
- యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌లు
- ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు
- విద్యా రుణాలు
- పార్ట్‌టైమ్ ఉద్యోగాల అవకాశం
- ఐఈఎల్‌టీఎస్/టోఫెల్/పీటీఈ
- జీఆర్‌ఈ (కొన్ని కోర్సులకు)
- జీమ్యాట్ (మేనేజ్‌మెంట్ కోర్సులకు)
- ఎస్‌ఏటీ/ఏసీటీ (కొన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు)
అప్లికేషన్ కు అవసరమైన పత్రాలు
- పాస్‌పోర్ట్
- మార్కుల మెమోలు
- డిగ్రీ/ప్రొవిజనల్ సర్టిఫికెట్
- ఇంగ్లిష్ టెస్ట్ స్కోర్
- స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్‌ఓపీ)
- లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ (ఎల్‌ఓఆర్)
- రెజ్యూమే/సీవీ
- ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్
- గుర్తింపు పొందిన యూనివర్సిటీనే ఎంచుకోండి.
- కోర్సు అక్రిడిటేషన్ పరిశీలించండి.
- వీసా నిబంధనలు ముందుగానే తెలుసుకోండి.
- ట్యూషన్ ఫీజు, జీవన వ్యయాలు లెక్కించండి.
- స్కాలర్‌షిప్‌లకు ముందుగానే దరఖాస్తు చేయండి.
- వీసా కోసం నకిలీ పత్రాలు సమర్పించవద్దు.
- అధికారిక వెబ్‌సైట్ల నుంచే సమాచారం సేకరించండి.
- కనీసం 8-12 నెలల ముందే ప్రణాళిక ప్రారంభించండి.
- ఇంగ్లిష్ ప్రావీణ్యంపై దృష్టి పెట్టండి.
- మంచి అకడమిక్ రికార్డు కొనసాగించండి.
- బలమైన ఎస్‌ఓపీ, ఎల్‌ఓఆర్ సిద్ధం చేసుకోండి.
- డెడ్‌లైన్లను తప్పకుండా పాటించండి.
- వీసా ఇంటర్వ్యూకు ముందుగానే ప్రాక్టీస్ చేయండి.
![]() ![]() | ![]() ![]() | ![]() |






