ఈ పరీక్షను నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మార్గదర్శకాల్లో, NBE (National Board of Examinations in Medical Sciences) ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తోంది.
తాజాగా FMGE 2026 జూన్ సెషన్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, దాని అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, ముఖ్య తేదీలు మరియు ప్రిపరేషన్ వివరాలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
విదేశాల్లో MBBS పూర్తి చేసిన భారత విద్యార్థులు భారత్‌లో:
- మెడికల్ ప్రాక్టీస్ చేయాలంటే
- PG (MD/MS) కోర్సుల్లో చేరాలంటే
- NMC & State Medical Councilsలో రిజిస్ట్రేషన్ పొందాలంటే
తప్పనిసరిగా FMGE ఉత్తీర్ణత సాధించాలి.
ఈ పరీక్ష ద్వారా అభ్యర్థి వైద్య పరిజ్ఞానం భారత ప్రమాణాలకు సరిపోతుందా లేదా అన్నది అంచనా వేస్తారు.
NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో సంచలనం.. బ్యూటీషియన్ పాత్రపై సీబీఐ దర్యాప్తు!
FMGE జూన్ సెషన్‌కు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది:
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2026 మే 11
- దరఖాస్తు సవరణ అవకాశం: మే 16 నుంచి 18 వరకు
- అడ్మిట్ కార్డ్ విడుదల: 2026 జూన్ 24 నుంచి
- పరీక్ష తేదీ: 2026 జూన్ 28
- ఫలితాలు విడుదల: 2026 జూలై 28
FMGEకు హాజరయ్యేందుకు అభ్యర్థులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి:
- విదేశాల్లో గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ నుంచి MBBS పూర్తి చేసి ఉండాలి.
- NEET-UG అర్హతతో విదేశాల్లో MBBS అడ్మిషన్ పొందినవారే అర్హులు.
- 2026 ఏప్రిల్ 30 నాటికి డిగ్రీ పూర్తి అయ్యి ఉండాలి.
అయితే అమెరికా, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కొన్ని దేశాల్లో డిగ్రీ పొందిన వారికి ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
గత కొన్ని సంవత్సరాల్లో FMGEకి హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే ఉత్తీర్ణత శాతం మాత్రం తక్కువగానే ఉంది.
- 2024లో సుమారు 79,000 మంది పరీక్ష రాశారు, వీరిలో 25.8% మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
- 2023లో 16.65% మాత్రమే పాస్ అయ్యారు.
- 2022లో 23.35% ఉత్తీర్ణత నమోదైంది.
ఈ గణాంకాలు FMGE ఎంత క్లిష్టమైన పరీక్షో స్పష్టంగా చూపిస్తున్నాయి.
FMGE మొత్తం 300 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం రెండు భాగాలుగా ఉంటుంది:
- Part A - 150 ప్రశ్నలు
- Part B - 150 ప్రశ్నలు
ప్రతి భాగంలో సెక్షన్ ఆధారంగా సమయ పరిమితి ఉంటుంది. ఒక సెక్షన్ పూర్తయిన తర్వాత తిరిగి ఆ ప్రశ్నలను చూడలేరు.
ముఖ్యంగా గమనించాల్సిన విషయం: నెగెటివ్ మార్కింగ్ లేదు
FMGEలో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 50% మార్కులు (150/300) సాధించాలి.
ఉత్తీర్ణత పొందిన వారికి:
- స్కోర్ కార్డ్
- సర్టిఫికెట్
- మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లభిస్తాయి.
FMGEలో ప్రశ్నలు ప్రధానంగా రెండు విభాగాల నుంచి వస్తాయి:
Pre-Clinical (100 మార్కులు)
- Anatomy
- Physiology
- Biochemistry
- Pathology
- Microbiology
- Pharmacology
- Forensic Medicine
Para Clinical & Clinical (200 మార్కులు)
- General Medicine & Allied
- Surgery & Allied
- Pediatrics
- OBG (Obstetrics & Gynecology)
- Community Medicine
- ENT, Ophthalmology, Psychiatry
- Orthopedics, Dermatology
FMGEలో విజయానికి కేవలం మెమరైజేషన్ కాదు, concept + application oriented preparation అవసరం.
మెడిసిన్‌లో కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రినాలజీ వంటి ప్రధాన విభాగాలపై బలమైన అవగాహన అవసరం. పిడియాట్రిక్స్, సర్జరీ, గైనకాలజీ వంటి క్లినికల్ సబ్జెక్ట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గత ప్రశ్నపత్రాల సాధన మరియు సిలబస్ ఆధారిత రివిజన్ విజయానికి కీలకం.
![]() ![]() | ![]() ![]() | ![]() |






