దేశ స్టార్టప్ రంగంలో క్రమేణా పురోగతి కనిపిస్తోంది. ముఖ్యంగా డీప్ టెక్ స్టార్టప్స్ సంఖ్య పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం స్టార్టప్స్ అంటే బిజినెస్ టు బిజినెస్ మోడల్‌లో ఉత్పత్తి రంగం, హార్డ్‌వేర్ రంగాల్లోనే ఉండేవి.
ఇప్పుడు పరిస్థితి మారింది. అన్ని రంగాల్లోనూ స్టార్టప్స్ విస్తరిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, రెన్యువబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీల్లో స్టార్టప్స్ సంఖ్య పెరుగుతోంది. అయితే అధిక శాతం స్టార్టప్స్ మెట్రో సిటీస్‌లోనే ఏర్పాటవుతున్నాయి. దీనికి కారణం మౌలిక సదుపాయాలు, ప్రీ సిరీస్ ఫండింగ్, ఏంజెల్ ఫండింగ్ అవకాశాలు అక్కడ కేంద్రీకృతమవడమే.
అకడమిక్ ఇన్‌స్టిట్యూట్స్ స్థాయిలోనే స్టార్టప్స్‌కు తోడ్పాటు అందించే చర్యలు ప్రారంభించాలి. కాలేజీల్లో ఇంక్యుమేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడం ఇందులో అత్యంత ప్రధానమైంది. అంతేకాకుండా సదరు ఇంక్యుబేటర్స్‌ను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోని ఇన్‌స్టిట్యూట్స్‌లో సైతం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలి. వీటికి సంబంధించి సదరు ఇన్‌స్టిట్యూట్స్‌లోని విద్యార్థులతోపాటు సమీపంలోని ఇతర ఇన్‌స్టిట్యూట్స్ విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలి. యువతలో తమ ఆశయాలను నెరవేర్చుకునే అవకాశం ముంగిటే ఉందనే సానుకూల దృక్పథం కల్పించాలి. ఐఐటీ చెన్నైలోని విద్యార్థులకే కాకుండా.. కోయంబత్తూరు, మదురై వంటి నగరాల్లోని విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. దీంతో ఈ ఇంక్యుబేషన్ సెల్‌లో దాదాపు 20 శాతం నాన్ ఐఐటీయన్స్ ఉంటున్నారు.
Prof Devendra Jalihal: AI యుగంలో విద్యార్థులు యాంత్రికంగా మారొద్దు.. సహజ నైపుణ్యాలే భవిష్యత్‌కు బలం!
ప్రస్తుత జాతీయ స్థాయి గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం స్టార్టప్స్‌లో 25 నుంచి 28 శాతం మాత్రమే మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటున్నారు. మహిళలు వ్యాపారంలో రాణించలేరేమో అనే సామాజిక అభిప్రాయం నేటికీ కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్టప్స్ ఏర్పాటు చేసిన మహిళల్లో ఎక్కువ శాతం మంది ఆయా రంగాల్లో అనుభవం గడించిన వారే తప్ప.. యంగ్‌ప్రెన్యూర్స్ లేరనే చెప్పాలి. మహిళా విద్యార్థులకు సరైన మెంటార్‌షిప్ కల్పించే విధంగా ఇన్‌స్టిట్యూట్స్ స్థాయిలో చర్యలు తీసుకోవాలి. విద్యార్థినులు సక్సెస్‌ఫుల్ మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి.
సరైన ప్రణాళిక లేకపోవడమే పెద్ద సమస్య. స్టార్టప్ ఏర్పాటు చేసేటప్పుడే.. ఇంక్యుబేషన్ స్థాయిలోనే తాము ఎంచుకున్న రంగం, ప్రొడక్ట్‌కు సంబంధించి మార్కెట్ స్కోప్ ఎలా ఉంది? కనీసం రానున్న పదేళ్ల కాలంలో ఎలాంటి మార్పులు సంభవించనున్నాయి? తమ ప్రొడక్ట్‌కు సమాంతరంగా ఎలాంటి బై ప్రొడక్ట్స్ రూపొందనున్నాయి? వాటికి తమ వద్ద ఉన్న ఆలోచన ఎలా సరితూగుతుంది అనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఉదాహరణకు.. ఏథెర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌నే పరిగణించొచ్చు. దాదాపు 13 ఏళ్ల క్రితం చిన్న కంపెనీగా ఈ సంస్థను ఏర్పాటు చేసిన వ్యక్తులు.. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రాధాన్యం పెరుగుతుందని గుర్తించారు. అందుకే ఈ రోజు ఈ సంస్థ పురోగమనంలో సాగుతోంది.
ప్రమోటర్స్‌కు సరైన ప్రెజెంటేషన్ స్కిల్స్ లేకపోవడం, ఫండింగ్ వేదికలను వినియోగించుకోలేకపోవడం దీనికి కారణమని చెప్పాలి. తమ స్టార్టప్స్‌కు ఫండ్స్ సమకూరాలంటే.. నిరంతరం ఏంజెల్ ఇన్వెస్టర్లతో సంప్రదింపులు సాగించాలి. అంతేకాకుండా తాము రూపొందించనున్న ప్రొడక్ట్ ప్రాధాన్యం, మార్కెట్లో దానికి ఉన్న ప్రస్తుత, భవిష్యత్తు డిమాండ్‌తోపాటు తమ ప్రణాళికలను గురించి ఏంజెల్ ఫండింగ్ సంస్థలు సంతృప్తి చెందేలా వివరించాలి. ఈ విషయంలో విఫలమైతే నిధులు సమకూరడం కష్టమే.
తాజా గణాంకాల ప్రకారం-దేశంలో ప్రస్తుతం 55 వేలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గత రెండేళ్లలోనే వీటిలో ఉద్యోగాల సంఖ్య లక్షకుపైగా పెరిగింది. ఇవే స్టార్టప్స్‌లో ఉద్యోగవకాశాలు ఉన్నాయనడానికి నిదర్శనం. రానున్న రోజుల్లో ప్రభుత్వ చర్యల ఫలితంగా స్టార్టప్స్ సంఖ్య మరింత పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి.
స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగం ద్వారా తమను తాము నిరూపించుకునే స్వేచ్ఛను పొందొచ్చు. ఎంఎన్‌సీలతో పోల్చితే తమలోని ఆలోచనలను నేరుగా ఉన్నతాధికారులకు అందించే అవకాశం ఉంటుంది. ఇదే కారణంతో ఐఐఎంలు, ఐఐటీల విద్యార్థులు కూడా స్టార్టప్ ఆఫర్స్‌కు మొగ్గు చూపుతున్నారు. అయితే స్టార్టప్ ఆఫర్‌ను అంగీకరించే క్రమంలో సదరు సంస్థ ప్రొడక్ట్, సేవలు, వాటికి ఉన్న ఆదరణ, ఫౌండర్స్ ప్రణాళిలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పని ప్రదేశంలో లభించే వెసులుబాట్లు అంటే ఇండిపెండెంట్ థింకింగ్‌పై దృష్టి పెట్టాలి.
![]() ![]() | ![]() ![]() | ![]() |






