Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల.. 'ADTP' పోస్టులకు కావాల్సిన అర్హతలు, ఎంపిక ప్రక్రియ ఇవే..!

TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల.. 'ADTP' పోస్టులకు కావాల్సిన అర్హతలు, ఎంపిక ప్రక్రియ ఇవే..!

SAKSHI EDUCATION 4 months ago
  • మొత్తం ఖాళీలు: 10 పోస్టులు
  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 10 జూలై, 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ: 17 ఆగస్టు, 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
  • పరీక్ష తేదీ (అంచనా): అక్టోబర్ 2026 లో ఉండవచ్చు.
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్: పరీక్ష తేదీకి వారం (7 రోజులు) ముందు నుంచి పరీక్షకు ముందు రోజు సాయంత్రం 5 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • వయసు: 01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపులు వర్తిస్తాయి).
  • వేతనం (Pay Scale): ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 58,850 నుంచి రూ. 1,37,050/- వరకు ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది.

అభ్యర్థులు తప్పనిసరిగా కింది విద్యార్హతలను కలిగి ఉండాలి.
1. బేసిక్ క్వాలిఫికేషన్:
కింది వాటిలో ఏదైనా ఒక డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
B.Arch (లేదా)
B.E./B.Tech (సివిల్) (లేదా)
B. Planning / B.Tech (ప్లానింగ్) (లేదా)
M.A లేదా M.Sc (జియోగ్రఫీ) (లేదా)
M.Sc (జియో ఇన్ఫర్మాటిక్స్).

2. అదనపు అర్హత (తప్పనిసరి):
పై బేసిక్ డిగ్రీతో పాటు.. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి (లేదా) ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఆఫ్ ఇండియాలో ఫెలోషిప్/అసోసియేట్‌షిప్ (లేదా) UGC గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ ప్లానర్ ఇన్‌స్టిట్యూట్‌లో సమానమైన సభ్యత్వం కలిగి ఉండాలి.

  • అభ్యర్థులు ముందుగా TGPSC అధికారిక వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in) లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాలి. ఇదివరకే OTR పూర్తి చేసిన వారు తమ ఐడీతో నేరుగా లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • గమనిక: కేవలం OTR నమోదు చేసుకున్నంత మాత్రాన ఈ పోస్టుకు దరఖాస్తు చేసినట్లు కాదు. ఈ నోటిఫికేషన్‌కు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సిందే.
  • రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు OTR లో ఇచ్చిన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని యాక్టివ్‌గా ఉంచుకోవాలి. ఎందుకంటే OTPలు, భవిష్యత్ సమాచారం అంతా వాటికే వస్తుంది.
  • సర్వర్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం అని కమిషన్ సూచించింది. ఇతర పూర్తి వివరాల కోసం ఈ క్రింది అధికారిక నోటిఫికేషన్ పిడిఎఫ్ ను చూడండి.

☛Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Facebook Page (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education