Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TGPSC : పీసీబీ 'అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్-2' ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారా.? నిపుణుల సలహాలు, ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకోసం..!

TGPSC : పీసీబీ 'అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్-2' ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారా.? నిపుణుల సలహాలు, ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకోసం..!

SAKSHI EDUCATION 1 week ago

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఈ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 44 సంవత్సరాలకు పెంచడంతో మరింత మంది అభ్యర్థులకు అవకాశం లభించింది.

  • దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 2, 2026
  • పరీక్షా సమయం (అంచనా): జూలై 2026
  • ప్రిపరేషన్‌కు ఉన్న సమయం: సుమారు 60 రోజులు

సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు స్మార్ట్ రివిజన్, గత సంవత్సరాల ప్రశ్నలు (PYQs), కోర్ సబ్జెక్టుపై పట్టు సాధించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.

  • విధులు : గాలి, నీరు, భూగర్భ జలాలు, మట్టిలో కాలుష్య స్థాయిలను పర్యవేక్షించడం, వ్యవసాయ కాలుష్య అంచనా మరియు రసాయన విశ్లేషణ చేయడం, శాంపిల్ టెస్టింగ్ రిపోర్ట్స్ తయారు చేయడం ఈ ఉద్యోగం యొక్క ముఖ్య బాధ్యతలు.
  • అర్హతలు: బీఎస్సీ కెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా ఉన్న ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సంబంధిత సైన్స్ స్ట్రీమ్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

ఈ పరీక్ష మొత్తం 300 మార్కులకు రెండు పేపర్లుగా జరుగుతుంది.

  • పేపర్ 1: జనరల్ నాలెడ్జ్ & జనరల్ స్టడీస్ (150 మార్కులు)
  • పేపర్ 2: కోర్ కెమిస్ట్రీ (150 మార్కులు)
  • స్కోరింగ్ అంతా కెమిస్ట్రీలో ఉన్నప్పటికీ, పేపర్-1ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ రమేష్ సూచించారు.
  • ఇందులో ఇండియన్ ఎకానమీ, పాలిటీ, జనరల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, తెలంగాణ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు తదితర అంశాలు ఉంటాయి.
  • ప్రతిరోజూ కరెంట్ అఫైర్స్ చదవడం, తెలంగాణ ప్రభుత్వ పథకాలను రివిజన్ చేయడం, పర్యావరణ విధానాలు మరియు నిరంతరం MCQ లను ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి.
  • ఉద్యోగ సాధనలో పేపర్-2 నిర్ణయాత్మకం. అభ్యర్థులు తమకు పట్టున్న అంశాల్లో గరిష్ట మార్కులు సాధించేలా ప్రిపేర్ కావాలి. ముఖ్యమైన టాపిక్స్.,
  • అటామిక్ స్ట్రక్చర్ & పీరియాడిసిటీ: ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్, పౌలీ ఎక్స్‌క్లూజన్ ప్రిన్సిపుల్, క్వాంటం నంబర్స్, అటామిక్ రేడియస్, ఐయోనైజేషన్ ఎనర్జీ వంటివి.
  • ఆమ్లాలు, క్షారాలు & పర్యావరణ కెమిస్ట్రీ: pH స్కేల్, బఫర్ సొల్యూషన్స్, HSAB రూల్, వాటర్ క్వాలిటీ పారామీటర్స్ (కాలుష్య నియంత్రణ ల్యాబ్‌లలో ఇవి చాలా ముఖ్యం).
  • డి-బ్లాక్ మూలకాలు : మాగ్నెటిక్ లక్షణాలు, కలర్ ప్రాపర్టీస్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆక్సీకరణ స్థితులు, ఉత్ప్రేరక చర్యలు (Catalytic activity).
  • ఫిజికల్ కెమిస్ట్రీ: థర్మోడైనమిక్స్ (ఫస్ట్ & సెకండ్ లా, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, మాక్స్‌వెల్ రిలేషన్స్) మరియు ఫోటోకెమిస్ట్రీ (ప్రత్యేకించి లాంబర్ట్-బీర్ లా - UV విజిబుల్ స్పెక్ట్రోస్కోపీకి ఇది కీలకం).
  • స్పెక్ట్రోస్కోపీ: ఇది సిలబస్‌లో అత్యంత ముఖ్యమైన విభాగం. UV-Visible, NMR, IR స్పెక్ట్రోస్కోపీ, ఫంక్షనల్ గ్రూప్ అనాలిసిస్‌పై ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.
  • స్టీరియోకెమిస్ట్రీ: బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉంటే ఈ విభాగంలో ప్రశ్నలు సులువుగా సాధించవచ్చు. సిమెట్రీ, ఆప్టికల్ ఐసోమెరిజం, RS, DL, EZ నామెంక్లేచర్ క్రమంలో చదవాలి.
  • ఇనార్గానిక్ కెమిస్ట్రీ: పూరీ & శర్మ
  • ఆర్గానిక్ కెమిస్ట్రీ: బహల్ & బహల్
  • ఫిజికల్ కెమిస్ట్రీ: బహల్ & బహల్ / ఎస్.చంద్ సిరీస్
  • స్పెక్ట్రోస్కోపీ & ఆర్గానిక్ నోట్స్: వై. జయప్రకాష్ రావు (YJP సర్) నోట్స్. క్లిష్టమైన కాన్సెప్ట్‌లను సులువుగా అర్థమయ్యేలా వివరించడంలో ఈ నోట్స్ బాగా ఉపయోగపడుతుందని నిపుణుల సలహా.
  • పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ (JL), డిగ్రీ లెక్చరర్ (DL), మరియు ఫోరెన్సిక్ సైన్స్ పరీక్షలకు సంబంధించిన పాత ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. దీని ద్వారా ప్రశ్నల సరళి, టైమ్ మేనేజ్‌మెంట్ పై స్పష్టమైన అవగాహన వస్తుంది.

HERE

  • పరీక్షకు కేవలం 60 రోజులు మాత్రమే ఉన్నందున, కొత్తగా కోచింగ్ సెంటర్లలో చేరడం కంటే సెల్ఫ్-స్టడీ (స్వంతంగా చదువుకోవడం) ఉత్తమమని డాక్టర్ రమేష్ సూచించారు. ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకొని, యూట్యూబ్ లెక్చర్స్, ఆన్‌లైన్ MCQలు, డిజిటల్ PDFల ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవాలి.
  • రోజుకు 6-8 గంటల చదువు: 2 గంటలు జనరల్ స్టడీస్‌కు, 4-5 గంటలు కెమిస్ట్రీకి, 1 గంట రివిజన్ మరియు MCQల ప్రాక్టీస్‌కు కేటాయించాలి.
  • చివరి 30 రోజులు: పూర్తి సిలబస్ రివిజన్, ఫార్ములాలు రోజూ చదవడం, పదే పదే పాత ప్రశ్నపత్రాలు (PYQs) మరియు మాక్ టెస్ట్‌లు రాయడం చేయాలి.

ఒక్క రోజు ఎక్కువ గంటలు చదవడం కంటే స్థిరమైన ప్రిపరేషన్, కచ్చితమైన ప్రణాళిక ఉంటే తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ప్రతిష్టాత్మకమైన 'అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్-II' ఉద్యోగాన్ని సులభంగా సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education