Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TS NEET Merit List Out: తెలంగాణ నీట్ మెరిట్ లిస్ట్ విడుదల.. మీ ర్యాంక్‌ను చెక్‌ చేసుకోండి

TS NEET Merit List Out: తెలంగాణ నీట్ మెరిట్ లిస్ట్ విడుదల.. మీ ర్యాంక్‌ను చెక్‌ చేసుకోండి

SAKSHI EDUCATION 2 weeks ago

జాబితాలో మొత్తం 38,021 మంది అభ్యర్థులకు స్టేట్‌ ర్యాంకులు ప్రకటించగా, మెరిట్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న వారు రానున్న కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.

మెరిట్ లిస్ట్‌లో చోటు దక్కిన అభ్యర్థులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య, దంత కళాశాలల్లో 85 శాతం రాష్ట్ర కోటాతో పాటు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం పొందనున్నారు.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న మెరిట్ లిస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ స్టేట్ ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), కేటగిరీ, లింగం, లోకల్ స్టేటస్ వంటి వివరాలను ఒకసారి పరిశీలించాలి. వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే విశ్వవిద్యాలయం ప్రకటించే గడువులోగా అభ్యంతరాలు తెలియజేయవచ్చు.

మెరిట్ లిస్ట్‌లో పేరు ఉన్నవారు తొలి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు నమోదు, ధ్రువపత్రాల పరిశీలన, సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.

  • KNRUHS అధికారిక వెబ్‌సైట్‌ https://www.knruhs.telangana.gov.in.ను క్లిక్‌ చేయండి.
  • Admissions లేదా Notifications ను ఎంచుకోండి.
  • Telangana NEET UG Merit List 2026 లింక్‌పై క్లిక్ చేయండి.
  • మెరిట్ లిస్ట్ PDFను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • Ctrl + F ద్వారా మీ పేరు లేదా రోల్ నంబర్‌తో వెతకండి.

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education