యూకే విదేశాంగ శాఖ, కామన్‌వెల్త్ అండ్ డెవలప్‌మెంట్(ఎఫ్‌సీడీఓ) ఆధ్వర్యంలో అందజేసే ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ పథకం ఇది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే కోర్సు పూర్తయ్యే వరకు ట్యూషన్ ఫీజులతో పాటు ఇతర అన్ని రకాల ఖర్చులనూ అందజేస్తారు.
చెవెనింగ్ స్కాలర్‌షిప్ పూర్తి వివరాలు..
చెవెనింగ్ అనేది అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన స్కాలర్‌షిప్ పథకం. ప్రతిభావంతులు, నాయకత్వ లక్షణాలు ఉన్న వారు యూకేలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో ఏడాది పాటు మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. చెవెనింగ్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారికి బ్రిటన్‌లో మాస్టర్స్ కోర్సు పూర్తయ్యే వరకు ట్యూషన్ ఫీజులతో పాటు ఇతర అన్ని రకాల ఖర్చులు ఈ పథకం కింద కవర్ అవుతాయి.
- విశ్వవిద్యాలయ అన్ని రకాల ట్యూషన్ ఫీజులు
- నెలవారీ జీవన భృతి
- బ్రిటన్‌కు రానుపోను విమాన ఖర్చులు
- బ్రిటన్‌కు వెళ్లాక లభించే అరైవల్ అలవెన్సులు
- స్వదేశానికి తిరిగి వెళ్లేటప్పుడు డిపార్చర్ అలవెన్సు
- వీసా దరఖాస్తు ఖర్చులు
- యూకేలో జరిగే చెవెనింగ్ ఈవెంట్లకు హాజరయ్యేందుకు ప్రయాణ ఖర్చులు
Girls Scholarship: ఏపీలో డిగ్రీ విద్యార్థినులకు రూ.30 వేల స్కాలర్‌షిప్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!
- యూకే మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించే అండర్ గ్రాడ్యుయేట్(డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి.
- స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు కంటే కనీసం రెండు సంవత్సరాల ముందే డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. కనీసం రెండేళ్ల పని అనుభవం లేదా 2,800 గంటల పని అనుభవం ఉండాలి.
- యూకేలోని మూడు యూనివర్సిటీల్లోని కోర్సులకు దరఖాస్తు చేసి ఉండాలి.
- నిర్ణీత గడువు లోపు కనీసం ఒక కోర్సు నుంచి అన్ కండిషనల్ ఆఫర్ పొందాలి.
- కోర్సు పూర్తయిన రెండేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి Ðð ళ్లేందుకు సిద్ధంగా ఉండాలి.
- యూకేలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు సైతం చెవెనింగ్ ద్వారా మరో మాస్టర్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- బ్రిటిష్ పౌరసత్వం లేదా ద్వంద్వ బ్రిటిష్ పౌరసత్వం ఉన్నవారు.
- దరఖాస్తు సమయంలో యూకేలో నివసిస్తున్నవారు.
- యూకే ప్రభుత్వ నిధులతో నడిచే స్కాలర్‌షిప్‌పై గతంలో ఆ దేశంలో చదువుకున్నవారు.
- యూకే ప్రభుత్వ శాఖలు, బ్రిటిష్ కౌన్సిల్ లేదా చెవెనింగ్ భాగస్వామ్య యూనివర్సిటీలలో ప్రస్తుత ఉద్యోగులు, గత రెండేళ్లలో స్థానికంగా ఉద్యోగం చేసినవారు.
- పాస్‌పోర్ట్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువు
- అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్
- అకడమిక్ సర్టిఫికెట్లు
- పని అనుభవానికి సంబంధించిన వివరాలు
- యూనివర్సిటీ ఆఫర్ లెటర్ (నిర్ణీత గడువులోగా సమర్పించాలి)
- అధికారిక చెవెనింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- సంబంధిత సైట్‌లో ఆన్ లైన్ ఖాతాను క్రియేట్ చేసుకోవాలి.
- అనంతరం స్కాలర్‌షిప్ దరఖాస్తు ఫారంను పూరించాలి.
- అవసమరమైన పత్రాలను సమర్పించాలి.
- అర్హత కలిగిన మూడు యూకే మాస్టర్స్ కోర్సులను ఎంచుకోవాలి.
షార్ట్‌లిస్ట్ అనంతరం ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
కేవలం అకడమిక్ ప్రతిభకే కాకుండా, నాయకత్వ లక్షణాలు, ప్రొఫెషనల్ అనుభవం వంటి వాటికి కూడా ఈ స్కాలర్‌షిప్ ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ నాయకులు, డిప్లొమాట్లు, పారిశ్రామికవేత్తలతో కూడిన భారీ గ్లోబల్ అలమ్నీ నెట్‌వర్క్‌లోకి వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 2026, అక్టోబర్ 6
- వెబ్‌సైట్: www.chevening.org
![]() ![]() | ![]() ![]() | ![]() |






