Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువ ఇంజనీర్లకు ఇండియన్ ఆర్మీ ఆహ్వానం.. TGC-144 నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండానే లెఫ్టినెంట్ ఉద్యోగం!

యువ ఇంజనీర్లకు ఇండియన్ ఆర్మీ ఆహ్వానం.. TGC-144 నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండానే లెఫ్టినెంట్ ఉద్యోగం!

SAKSHI EDUCATION 1 month ago

ముఖ్యంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగానే ఎంపిక చేయడం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత. ఈ కోర్సు 2027 జనవరి నుంచి ప్రారంభం కానుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • సివిల్ ఇంజనీరింగ్ - 08
  • కంప్యూటర్ సైన్స్ - 06
  • ఎలక్ట్రికల్ - 02
  • ఎలక్ట్రానిక్స్ - 06
  • మెకానికల్ - 06
  • మిసిలేనియస్ ఇంజనీరింగ్ - 02

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి:

  • BE / B.Tech
  • MSc Computer Science

ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 2027 జనవరి 1 నాటికి తమ డిగ్రీ పూర్తిచేసిన సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుంది.

  • Civil Engineering
  • Computer Science
  • Electrical Engineering
  • Electronics Engineering
  • Mechanical Engineering

అభ్యర్థులు ఆర్మీ నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు:

  • కనీసం - 20 సంవత్సరాలు
  • గరిష్టంగా - 27 సంవత్సరాలు ఉండాలి.

Indian Army TGC-144 ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది.

1. షార్ట్‌లిస్టింగ్

ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా కట్‌ఆఫ్ నిర్ణయించి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

ఫైనల్ ఇయర్ విద్యార్థులైతే చివరి సెమిస్టర్ వరకు వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.

2. SSB ఇంటర్వ్యూ

షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఈమెయిల్‌, SMS ద్వారా సమాచారం అందుతుంది.

  • ప్రయాగ్‌రాజ్
  • భోపాల్
  • బెంగళూరు
  • జలంధర్

ఇక్కడ ఐదు రోజుల పాటు SSB ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Stage-1

  • స్క్రీనింగ్ టెస్ట్
  • అర్హత సాధించినవారే తదుపరి దశకు అర్హులు

Stage-2

  • సైకాలజికల్ టెస్టులు
  • గ్రూప్ ఆఫీసర్ టాస్కులు
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

3. మెడికల్ పరీక్షలు

SSBలో ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీ మెడికల్ బోర్డు ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

4. ఫైనల్ మెరిట్ లిస్ట్

ఇంటర్వ్యూ మార్కులు + మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు.

అర్హత సాధించిన వారికి లెఫ్టినెంట్ హోదాతో నియామకం కల్పిస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు Indian Military Academy (IMA)లో 12 నెలల శిక్షణ ఉంటుంది.

శిక్షణ సమయంలో

  • నెలకు రూ.56,100 స్టైపెండ్ అందిస్తారు

శిక్షణ అనంతరం

  • ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాతో శాశ్వత ఉద్యోగం
  • ఆకర్షణీయమైన వేతనం, అలవెన్సులు, సదుపాయాలు లభిస్తాయి.

ఆన్‌లైన్
జూన్ 11, 2026
వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

>> Indian Army: ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా చేరే సువర్ణావకాశం.. TES-56 నోటిఫికేషన్ విడుదల!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education