Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
APCRDA ఆధ్వర్యంలో ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ విధులపై శిక్షణ `

APCRDA ఆధ్వర్యంలో ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ విధులపై శిక్షణ `

Satyam NEWS 3 days ago

ప్రజారాజధాని అమరావతి గ్రామాలలోని 18 నుంచి 45 సంవత్సరాలలోపు వారికి OHS(ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ)/ ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్‌గా ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో APCRDA ఆధ్వర్యంలో అమరావతిలోని SRM యూనివర్సిటీ సహకారంతో అక్టోబర్ 1వ తేదీ నుంచి ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

శిక్షణలో భాగంగా ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలవరకు 45 రోజులపాటు తరగతులు నిర్వహించబడతాయి. ఈ శిక్షణకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలలో డిప్లొమా/బీటెక్ పూర్తి చేసిన రాజధాని అమరావతి ప్రాంత యువత అర్హులు.

ఈ శిక్షణ ద్వారా యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకుని OHS(ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ)/ ఎన్విరాన్మెంటల్ స్పెషలిస్ట్‌గా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ అవగాహన సైతం ఈ శిక్షణ ఇవ్వడం, శిక్షణ అనంతరం..అభ్యర్థి పెర్ఫార్మన్స్, అనుభవం ఆధారంగా రాజధాని అమరావతిలోని పలు నిర్మాణ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ శిక్షణకు హాజరయ్యే వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించబడుతుంది. ఈ యొక్క ఉచిత శిక్షణలో చేరే ఆసక్తి కలవారు మీ గ్రామంలోని CRDA ఫెసిలిటేటర్‌ను సంప్రదించగలరు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News