Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బహిరంగంగా లంచాలు వసూలు చేస్తున్న ఆర్టీఏ అధికారులు?

బహిరంగంగా లంచాలు వసూలు చేస్తున్న ఆర్టీఏ అధికారులు?

Satyam NEWS 3 weeks ago

తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద భారీ సరుకు వాహనాల నుంచి ఆర్టీఏ అధికారులు బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

వీడియోలో ట్రక్ డ్రైవర్‌ను ఆపి రూ.20 నుంచి రూ.200 వరకు అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు కనిపిస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

వీడియోలో కనిపించిన కొందరు వ్యక్తులకు సరైన యూనిఫాం లేదా నేమ్‌ప్లేట్ కూడా లేవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో వెలుగులోకి రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు అక్రమంగా వసూలు చేసిన డబ్బుతో కూడబెట్టిన వారి ఆస్తులపై కూడా సమగ్ర విచారణ జరపాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ధైర్యంగా వీడియో తీసి ప్రశ్నించిన ట్రక్ డ్రైవర్‌ను నెటిజన్లు అభినందిస్తూ మద్దతు తెలుపుతున్నారు.

ఇది ఒక్క తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్ట్‌కే పరిమితం కాదని, రాష్ట్రంలోని పలు చెక్‌పోస్టుల వద్ద కూడా ఇదే తరహా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై సంబంధిత శాఖ వెంటనే స్పందించి, వీడియోలోని ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఈ ఆరోపణలు వెలువడ్డాయి. సంబంధిత అధికారుల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది అని తేలడంతో ఇతనిని విధుల్లో నుంచి తొలగించడం జరిగింది.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో డ్రైవర్ పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News