Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భీమిలిలో న్యాయవాదిపై కత్తితో దాడికి యత్నం

భీమిలిలో న్యాయవాదిపై కత్తితో దాడికి యత్నం

Satyam NEWS 15 hrs ago

భీమిలి మంగమారిపేటలో న్యాయవాది సూరాడ నరసింగరావుపై కత్తితో దాడికి యత్నించారంటూ చల్లపిల్లి అప్పలరాజుపై ఆరోపణలు వచ్చాయి. మంగళవారం మధ్యాహ్నం నరసింగరావు తన కార్యాలయంలో ఉండగా అప్పలరాజు కత్తితో ఆఫీస్‌లోకి వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని ఆరోపించారు.

ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సూరాడ నరసింగరావు చల్లపిల్లి అప్పలరాజు ఇద్దరు అన్నదమ్ములు వీరి మధ్య భూ వివాదం ఉంది అంటూ ఆరోపణలు ఉన్నాయి.

తనపై కక్షతోనే ఈ దాడికి యత్నించారని నరసింగరావు ఆరోపించారు. అప్పలరాజుతో పాటు ఘటనకు సహకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినా తగిన స్థాయిలో స్పందన లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీంతో న్యాయం కోసం ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వీడియోను పరిశీలించి, ఘటనపై విచారణ చేపట్టాల్సి ఉంది. న్యాయవాది కార్యాలయంలోకి కత్తితో వ్యక్తి రావడంతో భీమిలి ప్రాంతంలో ఈ ఘటన కలకలం రేపింది. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News