Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిచ్కుందలో ఆర్డీవో పర్యటన

బిచ్కుందలో ఆర్డీవో పర్యటన

Satyam NEWS 5 years ago

పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ పలు మండలాలపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలో జరిగిన సమీక్షలో పాల్గొన్నఆయనకు పలువురు మంజీరా నదిలో అక్రమంగా వే-బిల్లులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని సమాచారమివ్వడంతో స్పందించిన ఆయన బాన్స్‌వాడ ఆర్డీఓ రాజాగౌడ్ కు క్వారీలను పరిశీలించాల్సిందిగా ఆదేశించడంతో ఆర్డీవో బిచ్కుంద మండలంలోని ఖత్గావ్, మద్నురు మండలంలోని కుర్లా గ్రామాలలో కొనసాగుతున్నఇసుక క్వారీ పాయింట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వే బిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టంగా హెచ్చరించారు.

అనంతరం బిచ్కుంద తహసీల్దార్ కార్యాలయాన్నిసందర్శించి రికార్డులను పరిశీలించిన ఆయన ధరణి పోర్టల్ తదితర విషయాలపై తహసీల్దార్ వెంకట్రావును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తహసీల్దార్లతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా అధికారులు సిబ్బంది ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News