Dailyhunt
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

Satyam NEWS 1 week ago

డీజిల్ పోసుకొని ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బతుకుతెరువు కోసం నగరానికి వలసకు వచ్చిన ఒక కుటుంబం బడంపేట్ లోని న్యూ మారుతి నగర్ లో గత రెండు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు.

కుమార్తె కీర్తి(21) గండిపేట లోని ఎంజిఐటి కాలేజీలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. ఎప్పటి లాగానే కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న డీజిల్ ను పోసుకొని ఆత్మహత్య చేసుకుంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న మీర్పేట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి ఆమె సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News