Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారంటే...

ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారంటే...

Satyam NEWS 21 hrs ago

కాక్రోచ్ ల దెబ్బకి పదవి కోల్పోవాల్సి వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజీనామా పత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నది.

అసలు ఆ రాజీనామా పత్రంలో ఏమున్నది? ఈ ప్రశ్నకు సమాధానంగా 'సత్యంన్యూస్.నెట్' మీ కోసం ఆ లేఖను అందిస్తున్నది. లేఖను చదివి మీ వ్యాఖ్యలను ఈ వార్త కింద పోస్టు చేయండి.

లేఖలో ఉన్న వివరాలు

భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది.

యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు… వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు.

గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు.

భారత యువశక్తే దేశానికి అసలైన బలం.

దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదన్నదే నా సంకల్పం.

జంతర్-మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు.

దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి, కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి.

ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని గౌరవనీయ ప్రధానమంత్రి గారికి పంపించాను.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

దేశసేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకితభావంతో ఉంటాను.

శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భారతమాతకు, ఒడిశా ప్రజలకు, దేశ యువత ఆకాంక్షల సాధనకు భవిష్యత్తులోనూ నా వంతు సేవలను అందిస్తూనే ఉంటాను.

- ధర్మేంద్ర ప్రధాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Satyam News