Wednesday, 25 Nov, 7.47 am Satyam NEWS

హోమ్
ఎన్నికల ప్రచారంలో పువ్వాడ

హైదరాబాద్ నగరాభివృద్ది ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా 99వ డివిజన్ జూబ్లీహిల్స్, 114వ డివిజన్ కూకట్ పల్లి లో ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమలను వివరిస్తూ టీఆర్ఎస్ కే ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఈసారి కూడా ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం నందు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డివిజన్ బాధ్యులు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో 99వ డివిజన్ తెరాస అభ్యర్థి దేదీప్య రావు, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో114 అభ్యర్థి శ్రీనివాసరావును అత్యధిక ఓట్లతో గెలిపించాలని ఏర్పాటు చేసిన సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రజల సమస్యలపై టీఆర్ఎస్ కు ఉన్న పట్టింపు మరే ఇతర పార్టీలకు లేదని చెప్పారు. నీటి పన్నురద్దు చేయడంతో పాటు సెలూన్లు, దోబీ ఘాట్లు, లాండ్రీలకు ఉచిత కరెంట్ ఇస్తూ తెరాస ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేకుర్చే నిర్ణయం తీసుకుందన్నారు.

బీజేపీ కాంగ్రెస్ పార్టీల బూటకపు మాటలను నమ్మే స్థితిలో గ్రేటర్ ప్రజలు లేరని స్పష్టం చేశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని, ఎంతో మంది ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ కు పెట్టుబడులు రాకుండా మహా నగరంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి ఈ ఎన్నికల్లో మీరు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

మీకు మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా హామ ఇచ్చారు. సీఎం కేసిఆర్ ఆశీర్వాదం, కేటీఆర్ సహకారంతో మొత్తం హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా మారుతున్నదన్నారు.

సీఎం కేసీఆర్ మంచి పరిపాలకుడు. వారు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చాలా ముందు చూపుతో వున్నారని, కేసిఆర్ లాంటి ముఖ్యమంత్రి వుండటం మన అదృష్టం అన్నారు.

ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి మీరు అడగకున్న మీ కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతు.. వాటిని ఎక్కడ ఆగకుండా కొనసాగిస్తూనే ఉన్నారని అన్నారు.

ముఖ్యమంత్రి ప్రకటించిన కొత్త పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని, డిసెంబర్ నుంచి Ghmc ప్రజలందరికీ నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటి సరఫరా, ఈ డిసెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 67 వేల సేలూన్ల కు ఉచిత విద్యుత్ ఇవ్వడం సంతోషకరమన్నారు.

కరోనా సమయంలో నష్టపోయిన అన్ని దుకాణాలకు 6 నెలల కరెంట్ బిల్లుల నుంచి మినహాయింపు, కోవిడ్ సమయంలో నడవని వాహనాలకు టాక్స్ మినహాయింపు లక్షల కుటుంబాల్లో సంతోషాలు నింపిందన్నారు.

మూసీ నది ఆధునీకరణతో పాటు ఇలాంటి అనేక పథకాలతో పాటు, హైదరాబాద్ నగరాన్ని విశ్వ వ్యాప్త నగరంగా తీర్చిదిద్దుతున్నారని, దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో రెండో రాష్ట్రంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు.

ప్రశాంత వాతావరణం ఉన్నందునే లక్షల కోట్ల పెట్టబడులు మన హైదరాబాద్ కి వస్తున్నాయని తద్వారా ప్రైవేట్ రంగంలో లక్షలతో ఉద్యోగాలు వస్తున్నాయని అన్నారు. ఇంత అభివృద్ధి హైదరాబాద్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని గమనించాలన్నారు.
అందుకే, విజ్ఞులైన ప్రజలు ఆలోచించి, అభివృద్ధికి, సంక్షేమానికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్తులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Ghmcని మరింతగా అభివృద్ధి చేయడానికి సీఎం కేసిఆర్ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నానని విన్నవించారు.
ఈ ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Satyam News
Top